జ‌గ‌న్‌కు చిక్కుకుపోయిన చింత‌మ‌నేని

May 14, 2018 at 4:47 pm
chinthamaneni prabakar, at ys jagan, Praja samkalpa yatra, vehicle

రాజ‌కీయాల్లో ఒక్క‌క్క‌సారి చోటు చేసుకునే కొన్ని సంఘట‌న‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి. మ‌రికొన్ని ఘ‌ట‌న‌లు.. ఆనందం కూడా క‌లిగిస్తాయి. ఈ రెండు క‌లిసిన ఓ ఘ‌ట‌న ఈ రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అదికూడా జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఏలూరు మండ‌లం లింగాల గూడెంలో పాద‌యాత్ర సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌కు జ‌నాలు వేల సంఖ్య‌లో పోటెత్తారు. ఇస‌కేస్తే కూడా రాల‌ని విధంగా జ‌నాలు పోగ‌య్యారు. ఎక్క‌డ చూసినా జ‌న‌మే జ‌నం. ఏ వీధి చూసినా చీమ‌ల బారుల్లా వైసీపీ నాయ‌కులు. 

 

ఆకాశం రంగు పూసుకుందా అన్న‌ట్టుగా వైసీపీ జెండాలు ఇలా మారిపోయింది.. పాద‌యాత్ర ప్రాంతం. అయితే, ఇక్క‌డే ఓ అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. కాన్వాయ్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర  చేస్తున్న రూట్‌లో కి ఎంట‌ర‌య్యింది. ఈ దారి గుండానే ఆయ‌న వెళ్లాల్సి రావ‌డంతో ఆయ‌న కాన్వాయ్ ఇటువైపు వ‌చ్చింది. అంతే.. ఒక్క‌సారిగా పోలీసు అధికారులు, మీడియా వ‌ర్గాల్లోనూ టెన్ష‌న్ మొద‌లైంది. అస‌లే టీడీపీకి వైసీపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొన‌డం, అందునా చింత‌మ‌నేని ఫైర్ బ్రాండ్ కావ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని పోలీసులు మ‌థ‌న ప‌డ్డారు. 

 

ఈ క్ర‌మంలోనే హుటాహుటిన బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతం నుంచి అతి క‌ష్టం మీద చింత‌మేన‌ని కాన్వాయ్‌ను పంపించారు. స్థానికంగా నిర్మించిన కొత్త చ‌ర్చిని ప్రారంభించేందుకు చింత‌మేన‌ని అక్క‌డ‌కు వ‌చ్చారు. అయితే, ఆయ‌న వెళ్తున్న క్ర‌మంలోనే పాద‌యాత్ర అటు రావ‌డంతో కాన్వాయ్ అందులో చిక్కుకుపోవ‌డం అంద‌రినీ టెన్ష‌న్‌కు గురి చేసింది. అయితే, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం.. చింత‌మ‌నేనితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగ‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, చింత‌మ‌నేని కూడా త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి, వారికి మిఠాయిలు పంచి పెట్ట‌డం అంద‌రినీ ఆనందానికి గురి చేసింది. ముఖ్యంగా ఉప్పు-నిప్పు ఒకే చోట‌కు చేరేస‌రికి ఏం జ‌రుగుతుందోన‌ని భ‌య‌ప‌డ్డ పోలీసులు.. ఈ ప‌రిణామంతో సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 

 

జ‌గ‌న్‌కు చిక్కుకుపోయిన చింత‌మ‌నేని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share