చిరుకి జనసేన లైన్ క్లియర్!

November 3, 2018 at 11:45 am

పాపం చిరంజీవి..! ఇటు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగలేక‌.. అటు త‌మ్ముడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో క‌లిసి న‌డ‌వ‌లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌ధ్యే మార్గంగా మ‌ళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నా.. నాటి వైభ‌వాన్ని మాత్రం అందుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. అయితే.. ఏపీలో నెల‌కొన్న తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో చిరుకి ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు భావిస్తున్నారు. ఏమిటా అవ‌కాశం అంటే.. పార్టీ మార‌డం లేదా రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండ‌డం.. ఈ రెండింటిలో ఏదో ఒక‌టి చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ముందుముందు ఈ విష‌యంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

chiranjevi

సినీరంగంలో తిరుగులేని హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఆ త‌ర్వాత 2009లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించాడు. చిరుతోపాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉమ్మ‌డి రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. ఇక ఆ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ స‌త్తాచాట‌లేక‌పోయింది. చివ‌ర‌కు పార్టీని న‌డిపించ‌లేక ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డం.. ప‌లువురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌దవులు ద‌క్క‌డం.. కేంద్రంలో చిరుకి కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోవ‌డంతో రాజీనామా చేయ‌డం.. లాంటి ప‌రిణామాలు తెలిసిన‌వే. అయితే.. ఇక ఇక్క‌డి నుంచి మ‌రో సీన్ మొద‌లైంది. చిరు త‌మ్ముడు, ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేసి.. జ‌నంలోకి వ‌చ్చాడు.

45249911_708218929577385_1673977062827753472_n

ప్ర‌స్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమాల‌పై ద‌`ష్టి సారించారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ పార్టీలో యాక్టివ్ కావాల‌ని ఏకంగా రాహుల్ కోరినా ఆయ‌న స్పందించ‌లేద‌ట‌. ఆఖ‌రికి పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా రెన్యూవ‌ల్ చేసుకోలేదు. అలాగ‌ని ఆయ‌న పార్టీకి కూడా రాజీనామా చేయ‌లేదు. ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరాల‌ని అటు కుటుంబ స‌భ్యుల‌తోపాటు అభిమానులు కూడా చిరుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే..ఈ స‌మ‌యంలో జ‌న‌సేన‌లో చేరితే.. స్వార్థం కోసం చేరాన‌ని, ఇక ఈ స‌మ‌యంలో పార్టీ మారితే ప్ర‌తిష్ట మ‌రింత‌గా దిగ‌జారుతుంద‌నే ఆలోచ‌న‌లో చిరు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

45104688_2344480642232180_8739492435647791104_n

కానీ.. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చిరు నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అనుకూలంగా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. బీజేపీతో బంధం తెంచుకున్న టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తీ క‌డుతున్నారు. మొన్న‌రాహుల్‌తో కూడా భేటీ అయి క‌లిసిన‌డుస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు ద‌గ్గ‌ర‌కావ‌డాన్ని సాకుగా చూపించి.. చిరు జ‌న‌సేన పార్టీలో చేర‌డం లేదా.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం.. లాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. చిరు సినిమాల‌నే న‌మ్ముకుంటాడా..? లేక త‌మ్ముడితో చేయిక‌లుపుతా..? అన్న‌ది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

చిరుకి జనసేన లైన్ క్లియర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share