రాష్ట్ర మంత్రిగా చిరు హీరోయిన్

June 10, 2018 at 11:06 am
Chiranjeevi, thakeswari , karnataka, minister, politics, JDS

మెగాస్టార్ చిరంజీవితో ఓ సూప‌ర్ హిట్ సాంగ్‌లో న‌టించిన ఆ హీరోయిన్ ఇప్పుడు ఓ రాష్ట్రానికి కీల‌క శాఖా మంత్రి అయ్యారు. నీ మీద నాకు అదయ్యో.. ఈ పాట తెలుగునాట సూపర్ హిట్. చిరంజీవి హీరోగా ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాక్ష‌సుడు సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నీ మీద నాకు అద‌య్యో లాంటి సూప‌ర్ హిట్ సాంగ్‌లో న‌టించిన జ‌య‌మాల ఇప్పుడు క‌న్న‌డ నాట మంత్రి అయ్యారు.

రాక్షసుడు సినిమాలోని ఈ పాటలో మెగాస్టార్ చిరు, కన్నడ నటి జయమాల తమ స్టెప్స్‌తో అదరగొట్టారు. ఆ సినిమాలో తారకేశ్వరిగా ఆమె నటనను ఎవరూ మర్చిపోలేరు. ఆ జ‌య‌మాలే ఇప్పుడు క‌న్న‌డ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. కుమార‌స్వామి మంత్రివ‌ర్గంలో బెర్త్ ద‌క్కించుకున్న ఏకైక మ‌హిళా మంత్రి జ‌య‌మాల కావ‌డం విశేషం.

ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ బాధ్యతలను అప్పగించారు. 80లలో తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన జయమాల.. రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమె నేరుగా కేబినెట్ పదవి పొందిన సినీ నటిగా రికార్డులకెక్కారు. అలాగే బిల్లావా వర్గం నుంచి తొలిసారి మంత్రి అయిన వ్యక్తిగా కూడా ఆమె ఘనత సాధించారు.

Chiranjeevi, thakeswari , karnataka, minister, politics, JDS

రాష్ట్ర మంత్రిగా చిరు హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share