కాంగ్రెస్ నేత‌లూ.,. బెజ‌వాడ చూసి మీ హ‌వా ఏంటో చెప్పండి!

July 12, 2018 at 11:23 am
Congress Party, Comments on YSRCP, Vijayawada, 2014 elections, TDP won

కొన్ని ప్రాంతాలు.. కొన్ని జిల్లాల్లో ప్ర‌జ‌ల తీరు చాలా చిత్రంగా ఉంటుంది. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు నిల‌బ‌డ్డా.. వారు చేసే ఓటింగ్ మాత్రం చిత్రాతి చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు విజ‌య‌వాడ ఎంపీ సీటు విష‌యంలోనూ అలాగే ఉంది ప‌రిస్థితి. 2014కు ముందు ఇక్క‌డ కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. నిజానికి ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్టు వారి ఓటు బ్యాంకు మొత్తంగా వైసీపీ ప‌ర‌మైంద‌ని అంటున్నారు. అంతేకాదు, వారి నేత‌ల‌తోనే వైసీపీ గ‌ట్టెక్కింద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి విజ‌య‌వాడ ప‌రిస్థితినే చూసుకుంటే.. ఇక్క‌డ పలు నియోజ‌క‌వ‌ర్గాలు కాంగ్రెస్‌కు కంచుకోట‌లుగా ఉన్నాయి. 2014కు ముందు విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ వ‌రుస‌గా రెండు సార్లు గెలుచుకుంది.

అంతేకాదు, ఇక్క‌డ ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన‌తి కాలంలో త‌న మామ ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర‌ను మించిన రాజ‌కీయ నేత‌గా ఎదిగారు. నిజానికి ఉపేంద్ర అంటే కూడా మ‌రిచిపోయే ప‌రిస్థితిని ఆయ‌న క‌ల్పించారు. అలాంటి చోట‌.. మ‌రి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి రావాల్సి ఉంది.(కాంగ్రెస్ పెద్ద‌లు తీర్మానించిన‌ట్టుగా) కానీ, 2014లో అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డ వైసీపీ నుంచి కోనేరు రాజేంద్ర‌ప్ర‌సాద్(పెద్ద ఇండ‌స్ట్రియ‌లిస్ట్‌) ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డారు. భారీ ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. అంతేకాదు, చాప‌కింద నీరులా.. కాంగ్రెస్‌లోని కొంద‌రు నాయ‌కులు ఆయ‌న‌కు అమ్ముడు పోయార‌ని కూడా అప్ప‌ట్లో టీడీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి గెలుపొంద‌లేదు.

పైగా.. టీడీపీ త‌ర‌ఫున తొలిసారి రంగంలోకి దిగిన కేశినేని నాని విజృంభించాడు. అఖండ మెజార్టీతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కాడు. నిజానికి కేశినేని, కోనేరు ఇద్ద‌రూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన‌వారే.. ఇద్ద‌రూ తొలిసారి ప్ర‌జాక్షేత్రంలో పోటి ప‌డ్డ‌వారే. ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే.. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్టు.. త‌మ ఓట్ల‌ను జ‌గ‌న్ కొట్టేశాడ‌ని, త‌మ వారిని ప‌ట్టేశాడ‌ని.. అనుకుంటే.. బెజ‌వాడ‌లో ఎందుకు ఎంపీ టికెట్ వైసీపీ ఎందుకు గెల‌వ‌లేక పోయిందో ఆ నేత‌లు ఇప్పుడు స‌మాధానం చెప్పాలి? వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన ల‌గ‌డ‌పాటి అప్ప‌ట్లో రాజ‌కీయంగా అనేక సంచ‌నాలు సృష్టించాడు. పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే(మిరియాల ర‌సాయనం) చ‌ల్లి సంచ‌ల‌నం సృష్టించాడు. అయినా ఆ సానుభూతి ఎక్క‌డా ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కు కానీ, కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్టు వైసీపీకి కానీ ద‌క్కింది లేదు.

ఇలాంటి విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీ పై అభాండాలు వేయ‌గానే స‌రికాద‌నేది వైసీపీ నేత‌ల మాట‌! కాంగ్రెస్ ఏనాడో చ‌చ్చిపో యింది. ఎప్పుడైతే.. విభ‌జ‌న‌కు అంకురార్ప‌ణ జ‌రిగిందో ఆనాడే కాంగ్రెస్ నేత‌లు స్వ‌యంగా పార్టీని చంపుకున్నారు. నేడు త‌మ పార్టీని ఏదో జ‌గ‌న్ ఛండుకుతిన్నాడ‌ని, త‌మ వారిని లాక్కున్నాడ‌ని శోక‌ణ్ణాలు పెట్ట‌డంలో అర్ధం లేదు. జ‌గ‌న్ క‌ష్టం జ‌గ‌న్ ప‌డుతున్నాడు. రేపు ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బాస‌ట‌గా ఉండేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. దీనిని చూసి ఓర్చుకోలేక‌… బాబుతో వియ్య‌మందాల‌ని నిర్ణ‌యించుకుని ఇప్పుడు విషం క‌క్క‌డం ఎందుకు అనేది ప్ర‌జ‌ల సూటి ప్ర‌శ్న‌!!

కాంగ్రెస్ నేత‌లూ.,. బెజ‌వాడ చూసి మీ హ‌వా ఏంటో చెప్పండి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share