కాంగ్రెస్ అహంకారానికి మూలకారణం ఏంటి?

October 15, 2018 at 6:59 pm

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నాలుగు పార్టీలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా.. ప్రతిష్టంభన ఏర్పడడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని చెప్పాల్సిందే. కూటమిలోని పార్టీలకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అహంకారపూరితగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలుసర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమిలోని పార్టీలకు గౌరవప్రదమైన సీట్లు కేటాయిస్తూ ఉన్న 119 స్థానాలు పంచుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో కాంగ్రెస్ మొండికేస్తుండడమే ఇప్పుడు సకల అరిష్టాలకు హేతువు అవుతోంది.

dfhmcftn_650x400_bigstry(1)_11_September_2018_9-48-06PM

నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు మర్యాదలను పాటించడం లేదు. ఏదో ఇప్పటికిప్పుడు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. తాము వక్రమార్గంలో లబ్ధి పొందడానికి వారు ఈ పొత్తులకు సై అన్నారే తప్ప.. వాస్తవంలో మిగిలిన మూడు పార్టీలతో స్నేహాన్ని కొనసాగించే ఉద్దేశం కూడా వారికి లేనట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఉన్న 119 స్థానాలను పంచుకోవడంలో తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 90 సీట్లకు తగ్గకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అంతకంటె చిత్రంగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ … ఢిల్లీలో తనను కలిసిన కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. ఏకంగా వంద సీట్లు గెలచుకుని రావాలంటూ టార్గెట్ పెట్టారు. వంద గెలవమని చెప్పిన రాహుల్ కు కనీసం ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయో, మొత్తం ఎన్ని పార్టీలు కూటమిలో ఉన్నాయో అనే కనీస ప్రాథమిక పరిజ్ఞానం అయినా ఉందని అనుకోలేం. ఆయన విధించిన టార్గెట్ కు దగ్గరగా.. 90 కు తగ్గరాదని కాంగ్రెస్ కోరిక.

తద్వారా.. ప్రభుత్వానికి అవసరమైన 60 సీట్లను తామే నెగ్గగలమని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. ఈ కూటమిలోని పార్టీల మీద ఆధారపడే అవసరం తమకు ఏర్పడరాదని వారు కోరుకుంటున్నారు. అంటే ఇది కేవలం వారి అవకాశ వాద పొత్తు మాత్రమే తప్ప.. సిద్ధాంత సారూప్యత ఉన్న పొత్తు ఎంతమాత్రమూ కాదని స్పష్టంగా తేలిపోతున్నది. ఏ కొంచెం సీట్ల విషయంలో రాజీపడినా… తాము 60 మార్కులను అదుకోవడం జరగదని, మళ్లీ ఈ పార్టీల మీద డిపెండ్ కావాలని, అందుకే సీట్ల వద్ద రాజీపడరాదని కాంగ్రెస్ భావన.

భాగస్వామ్య పక్షాలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ అహంకారానికి మూల కారణం ఈ అత్యాశే అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఆ పరిస్థితులు ఎలా చక్కబడతాయో చూడాలి.

కాంగ్రెస్ అహంకారానికి మూలకారణం ఏంటి?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share