కాంగ్రెస్ బస్సుయాత్ర వెనుక వైఎస్సార్

February 22, 2018 at 11:17 am
Congress party, telangana, buss yatra, ys rajashekar reddy, inspiration

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖరరెడ్డిది చెరగని ముద్ర. కష్ట కాలంలో పార్టీని ముందుండి నడిపించిన నేత. 1994 – 2004 మ‌ధ్య ప‌దేళ్ల‌పాటు అధికారంలోకి దూర‌మైన కాంగ్రెస్‌ను త‌న పాద‌యాత్ర‌తో అధికారంలోకి తెచ్చిన ఛ‌రిష్మా ఉన్న నేత‌గా వైఎఎస్ గుర్తింపు పొందారు. పాద‌యాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన తొలి వ్య‌క్తిగా వైఎస్ రికార్డుల‌కు ఎక్కారు. 2003లో వైఎస్ చేవెళ్ల టు ఇచ్ఛాపురం వ‌ర‌కు సాగించిన పాద‌యాత్ర కాంగ్రెస్‌ను 2004తో పాటు 2009లోనూ అధికారంలోకి తీసుకువ‌చ్చింది.

 

ప‌దేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెసుకు తన వందల కిలోమీటర్ల పాదయాత్రతో మళ్లీ ఊపిరి పోసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన పలు పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందుకే రాష్ట్రం విడిపోయిన కూడా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రజల గుండెల్లో పిలిచిపోయారు. ఆయన మరణం తెలుగు ప్రజలను దు:ఖ సాగరంలో ముంచెత్తింది. ఆయన మరణం తర్వాత అనేక పరిణామాల మధ్య వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ప్రత్యేక పార్టీ వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నుంచి విడిపోయారు. 

 

ఇక విషయానికి వస్తే… ఈనెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనుంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ యాత్ర చేపడుతోంది. అంతేకాకుండా ఈ యాత్రకు వైఎస్సార్ స్పూర్తిగా నిలిచారు. 2004లో అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ పాదయాత్ర చేపట్టారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మండే ఎండలను లెక్క చేయకుండా ఆయన నడిచి చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపారు. అయితే ఆనాడు వైఎస్సార్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 

 

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా చేవెళ్ల నుంచే బస్సు యాత్ర చేపట్టి, ఆనాడు ఏయే ప్రాంతాల మీదుగా వైఎస్సార్ వెళ్లారో అదే మార్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ బస్సుయాత్రలో రేవంత్ రెడ్డి, విజయశాంతి పాల్గొంటున్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ పాదయాత్ర సెంటిమెంట్ పనిచేస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

 

కాంగ్రెస్ బస్సుయాత్ర వెనుక వైఎస్సార్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share