జగన్ వైపు చూస్తున్న పవన్ ఫ్రెండ్స్!

August 3, 2018 at 7:33 pm
CPM, CPI, YS Jagan, YSRCP, 2019 Elections, Janasena party, pawan kalyan

గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ వెంట ఉన్న వామపక్షాల ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయా అంటే..అవుననే అంటున్నారు రాజకీయ విశ్లషకులు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రకరకాల పొత్తులు – కొత్త కొత్త స్నేహాలు అంకురిస్తున్నాయి. మొన్నటి వరుకు టీడీపీని టార్గెట్ చేసుకొని జగన్, పవన్ కళ్యాన్ లు విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో వైసీపీ-జనసేన పొత్తులు ఉండబోతున్నాయని తెగ వార్తలు వచ్చాయి. కానీ తూ.గో.జిల్లాలలో పవన్ పర్సనల్ లైఫ్ పై జగన్ కామెంట్ చేయడం..జగన్ జైలు జీవితంపై పవన్ కామెంట్ చేయడంతో వీరిద్దరి మద్య ఎలాంటి దోస్తీ ఉండబోదని తేలిపోయింది.

అయితే పవన్ రాజకీయల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం వామపక్షాల వైపు మాట్లాడుతూ వచ్చారు…దాంతో పవన్ కి వామపక్షాలు చేరువ అవుతాయని భావించారు. కానీ ఈ మద్య ఓ కార్యక్రమంలో పొత్తు గురించి మాట్లాడగా అవేమీ ఇప్పట్లో ఉండవనే హింట్ ఇచ్చారు పవన్. పవన్ కల్యాణ్ వెంట ఉన్న వామపక్షాలకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కలవరపరిచాయంటున్నారు. నియోజక వర్గ పరిశీలకుల నియామకాలతో పాటు – పార్టీలోని కీలక పదవులను ఒకే కులానికి చెందిన వారికే ఇవ్వడం వామపక్ష నాయకులకు ఆగ్రహం తెప్పించింది.

37912175_639456189786993_1887190947482042368_n

కొంత కాలంగా జగన్ చేస్తున్న పాదయాత్ర – దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన వామపక్ష పార్టీలు జగన్ వైపు చూసేలా చేస్తున్నాయ్. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన వామపక్షాల నాయకులలో ఆలోచనలను రేకెత్తించింది. ఇక బిజేపీకి జగన్ మద్దతు ఇస్తారని – ఆయన నరేంద్ర మోదీ మనిషేనని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను సీపీఐ – సీపీఎం నాయకులు అంగీకరించడం లేదు.

రెండు దశాబ్దాలకు పైగ దగ్గరుండి చూసిన లెఫ్ట్ పార్టీల నాయకులు చంద్రబాబులో మార్పు రాదని అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ తో వామపక్షాలు కలిసిమెలిసి ఉన్న విషయం తెలిసిందే. జగన్ మోహాన రెడ్డిలో తన తండ్రి రాజశేఖర రెడ్డి పట్టుదల వివిధ అంశాలపై స్పష్టత ఉండడం గుర్తించామని అందుకే ఆయనతో ప్రయాణించాలని ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సీపీఎంకు చెందిన ముఖ్యనేత ఒకరు తెలిపారు. అన్నీ కుదిరితే ఎన్నికల నాటికి వామపక్షాలు – వైఎస్ ఆర్ కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉంది.

జగన్ వైపు చూస్తున్న పవన్ ఫ్రెండ్స్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share