వైసీపీలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు..

March 15, 2019 at 4:30 pm

వైసీపీలోకి రోజురోజుకు చేరిక‌లు పెరిగిపోతున్నాయి. ఎప్ప‌డూ సామాన్యుల మ‌ధ్యే గ‌డుపుతున్న జ‌గ‌న్‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌డం చూసి చేరిక‌లు ఊపందుకున్నాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తున్నారు. అదే దారిలో ఇప్పుడు దివంగ‌త ద‌ర్శ‌క నిర్మాత కేంద్ర మాజీ మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారుడు దాస‌రి అరుణ్ వైసీపీలో చేరారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో గురువారం ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్ సిద్ధాంతాలు న‌చ్చాయ‌న్నారు. పేద ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ప‌డుతున్న తాప‌త్ర‌యం బాగుంద‌ని, వారి క‌ష్టాలు తీర్చ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నం హ‌ర్ష‌నీయం అన్నారు.

ఏసీ బంగ్లాలు, కార్ల‌లో తిరిగితే వారి క‌ష్టాలు తెలియ‌వ‌ని గ‌మ‌నించి కాలి బాట‌న వంద‌ల కిలోమీట‌ర్లు తిరుగుతూ ప్ర‌త్య‌క్షంగా అతి సామాన్యుల‌తో కూడా మాట్లాడుతూ వారి కంటి నీటిని తుడిచేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నారు. త‌న తండ్రి దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌తికుంటే వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగేవార‌ని చెప్పారు. ఎప్పుడూ వైఎస్ గురించే చెప్పేవార‌ని, ఆయ‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై చాలా సార్లు మాట్లాడుకున్నామ‌న్నారు. ఆయ‌న క‌డుపు పుట్టిన జ‌గ‌న్ కూడా ఇప్పుడు తండ్రి బాట‌లోనే న‌డుస్తూ లేనివాడికి ఏదైనా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్ల‌డం న‌చ్చింద‌న్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల గురించి ఆలోచించే నేత వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం పీఠంపై కూర్చుంటే ఇంకా ఎంత అభివ్రుద్ధి జ‌రుగుతుందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. త‌న వంతుగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికే వైసీపీలో చేర‌న‌న్నారు. జ‌గ‌న్ ఏ ప‌ని అప్ప‌గించినా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. కాబోయే సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అని రాష్ర్టమంతా మారుమోగుతోంద‌ని, పిల్లాడు మొద‌లు పండు ముస‌లి వర‌కు ఆయ‌న వెంటే న‌డ‌వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌న్నారు. కాగా, దాస‌రి అరుణ్‌కుమారే కాకుండా మాజీ ఎమ్మెల్యే ల‌బ్బి వెంక‌ట‌స్వామి, గురు రాఘ‌వేంద్ర సంస్థ‌ల చైర్మ‌న్ ద‌స్త‌గిరిరెడ్డి కూడా వైసీపీలో చేరారు.

వైసీపీలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share