బాబుకు అధికారుల `ప‌డ‌వ` గంత‌లు!

May 16, 2018 at 5:00 pm
Devipatnam, boat sink in godavari river, chandra babu, government

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగానే ఉన్నాయి. కానీ, ప్ర‌జ‌ల ప్రాణాలే పోతున్నాయి! ఇదీ ఇటీవ‌ల రాష్ట్ర పోలీసు విభాగం ఉన్న‌తాధికారి ఒక‌రు చేసిన వ్యాఖ్య‌. శాంతి భ‌ద్ర‌త‌లు అంటే.. అల్ల‌ర్లు.. కొట్టుకోవ‌డం.. రాళ్లు రువ్వుకోవ‌డం, ఉద్రిక్త‌త‌లు సృష్టించ‌డ‌మే కాద‌ని..  ప్ర‌జ‌ల ప్రాణాలు కూడా భ‌ద్రంగా ఉండేలా చూసుకోవాల‌ని ఆయ‌న చెప్ప‌కుండా చెప్పుకొచ్చారు. గ‌డిచిన నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఖ‌డ్గాలు తీయ‌ని ప్రాణాలు జ‌ల‌ఖ‌డ్గాలు తీస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో మ‌రింతగా పెచ్చుమీరాయి. కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌కు లెక్క‌లేకుండా పోయింది. గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో పోటెత్తిన ప్ర‌జానీకాన్ని నిలువ‌రించ‌డంలో విఫ‌ల‌మైన ప్ర‌భుత్వం అక్ష‌రాలా 29 మంది ప్రాణాలు పోయేందుకు కార‌ణ‌మైంది. 

 

ఇక‌, గ‌త ఏడాది న‌వంబ‌రు కార్తీక మాసంలో కృష్ణాన‌ది సంగ‌మ ప్రాంతంలో జ‌రిగిన బోటు ప్ర‌మాదంలో 23 మంది ప్రాణాలు కృష్ణ‌మ్మ త‌న‌లో క‌లుపుకొంది. ఇక‌, నిన్న‌టికి నిన్న గోదావ‌రి న‌దిలో జ‌రిగిన ప్ర‌మాదంలో క‌నీసం 45 మంది మృతి చెందార ని తెలుస్తోంది. పైకి ఇవి ప్ర‌మాదాలు గానే క‌నిపిస్తున్నా.. వెనుక మాత్రం రాజ‌కీయనాయ‌కులు, అధికారుల అవి నీతికూ పం, బాధ్య‌తా రాహిత్యం అంతకు మించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. టూరిజం, ఇరిగేషన్‌, ఆయా ప్రాంతాల రెవెన్యూ, పోలీస్‌, ఫారెస్టు శాఖల్లో కొంతమంది అధికారులు బోటు నిర్వాహకులతో కుమ్మక్కై మాఫియాను పెంచిపోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

వాస్తవానికి గోదావరిలో నాటు పడవలకు అనుమతి లేదు. వీటికి అధికారులు లైసెన్సు ఇవ్వరు. కానీ అనధికారికంగా లెక్కలేనన్ని నాటు పడవలు తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు.  ఇక గతేడాది కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదం తర్వాత కూడా నిబంధనలు ఎవరూ పాటించడంలేదు. ఇటీవల గోదావరిలో రాయల్‌ బోటు దగ్ధమైన సంగతి తెలిసిందే. 10 నిమిషాలు ఆలస్యమైతే 127 మంది ప్రాణాలు మంటల్లో మాడిపోయేవి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. బోట్లన్నింటినీ తనిఖీ చేసే వరకు పాపికొండల బోట్లను ఆపేయాలని ఆదేశించింది. అయితే మామూళ్లకు మరిగిన వివిధ శాఖ అధికారులు హడావుడిగా సోమవారం 22 బోట్లను తనిఖీ చేసి అన్ని బాగానే ఉన్నట్టు ధ్రువీకరించారు. 

 

కానీ దేవీపట్నం నుంచి తిరుగుతున్న లాంచీలను తనిఖీ చేయలేదు. అందులో ఒక లాంచీనే తాజాగా ప్రమాదానికి గురైంది. నిర్వాహకులతో ఆయా శాఖల అధికారులు కుమ్మక్కై లాభాలు పంచుకోవడంతోపాటు.. కొందరు అధికారులు, వారి బంధువుల పేరుతో బోట్లు, లాంచీలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బు లాగడం తప్ప.. గోదావరి మధ్యలో ఎక్కడా దిగడానికి.. ఎక్కడానికి జెట్టీలు కూడా నిర్మించలేదు. మొత్తంగా ఇలాంటి ప‌రిణ‌మాలు  చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి గొడ్డ‌లి పెట్టుగా ప‌రిణ‌మించ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారువిశ్లేష‌కులు. 

 

బాబుకు అధికారుల `ప‌డ‌వ` గంత‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share