గ‌ల్లా ఖాతాలో మరో టీడీపీ టికెట్!

December 18, 2017 at 10:35 am
Galla jaydev, Galla Ramadev, TDP, Guntur, chandra giri, Mangala giri

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కూ ఓ సీటు కావాల‌ని ఇప్ప‌టి నుంచే చాలా మంది ప్ర‌ముఖ నేత‌లు, నేత‌ల బంధువులు, వార‌సులు ఖ‌ర్చీఫ్ వేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓ రాజ‌కీయ ఫ్యామిలీకి చెందిన వార‌సురాలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి తెర‌వెన‌క పెద్ద ప్లానింగ్ జ‌రుగుతున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా ప్ర‌తినిధుల‌కు తెలిసింది. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న గ‌ల్లా ఫ్యామిలీకి చెందిన మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి కుమార్తె, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సోద‌రి అయిన ర‌మాదేవి పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం గ‌ల్లా ఫ్యామిలీ తెర‌వెన‌క ప్లానింగ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ర‌మాదేవి గ‌త ఎన్నిక‌ల్లోనే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన త‌న సోద‌రుడు జ‌య‌దేవ్ త‌ర‌పున ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌మాదేవి గ‌ల్లా అరుణ‌, జ‌య‌దేవ్ భార్య గ‌ల్లా ప‌ద్మ కంటే ఎక్కువుగా ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆమె ప్ర‌స్తుతం అమెరికాలో డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. జ‌య‌దేవ్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమే త‌ర‌చూ ప‌ర్య‌టిస్తున్నారు. స్వ‌త‌హాగా వైద్యురాలు కావ‌డంతో అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఉండే నిరుపేద పిల్లల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు, మారు మూల ప్రాంతాల్లో ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఆమె ఎక్కువ కృషి చేస్తున్నారు. 

ఆమె గ‌త కొద్ది రోజులుగా జ‌య‌దేవ్ కంటే ఎక్కువుగా కూడా గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే ర‌మాదేవి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నార‌ని, ఇందుకోసం ముంద‌స్తు ప్లాన్‌లో భాగంగానే ఆమె ఇక్క‌డ జ‌నాల మధ్య‌కు వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ర‌మాదేవి వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి లేదా గ‌ల్లా సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మొన్న ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం 12 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయినా పార్ల‌మెంటుకు వ‌చ్చేస‌రికి జ‌య‌దేవ్‌కు మెజార్టీ వ‌చ్చింది. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త కొన్ని ఎన్నిక‌లుగా పొత్తులో ఎవ‌రో ఒక‌రికి కేటాయిస్తూ రావ‌డంతో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి అన్ని ర‌కాలుగా గ‌ల్లా ఫ్యామిలీకి చెందిన ర‌మాదేవి బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌ని, అటు జ‌య‌దేవ్ అండ‌దండ‌లు కూడా ఆమెకు పుష్క‌లంగా ఉంటాయ‌ని గ‌ల్లా వ‌ర్గంతో పాటు టీడీపీ భావిస్తోంది.

మ‌రో వార్త ఏంటంటే ఇప్ప‌టికే గ‌ల్లా చిత్తూరు జిల్లా నుంచి వ‌చ్చి గుంటూరులో ఎంపీగా ఉన్నారు. ఒకే ఫ్యామిలీకి నాన్ లోక‌ల్‌గా రెండు సీట్లు ఎలా ఇస్తార‌న్న ప్ర‌శ్న కూడా వ‌స్తోంది. ఈ ప్ర‌శ్న ఇక్క‌డ బాగా రైజ్ అయితే అప్పుడు ర‌మాదేవిని త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చంద్ర‌గిరి నుంచే బ‌రిలోకి దింపనున్నార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గ‌ల్లా అరుణ ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె త‌ప్పుకుని అక్క‌డ నుంచి త‌న కుమార్తెను పోటీ చేయింవ‌చ్చ‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది. అయితే గ‌ల్లా ర‌మాదేవి కోసం ముందు ఆప్ష‌న్‌గా మంగ‌ళ‌గిరినే ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇక్క‌డ కుద‌ర‌ని ప‌క్షంలోనే చంద్ర‌గిరి నుంచి ఆమెను పోటీ చేయించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

రెండు చోట్లా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులే :

ఇదిలా ఉంటే గ‌ల్లా ర‌మాదేవి మంగ‌ళ‌గిరిలో పోటీ చేసినా, చంద్ర‌గిరిలో పోటీ చేసినా రెండు చోట్లా వైసీపీ నుంచి బ‌ల‌మైన నాయ‌కులే ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా ఉన్నారు. మంగ‌ళ‌గిరిలో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏకంగా సీఎం చంద్ర‌బాబు మీదే కేసులు వేస్తూ టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు సాధించారు. ఇక చంద్ర‌గిరిలో చెవిరెడ్డి కూడా వైసీపీ త‌ర‌పున స్ట్రాంగ్ క్యాండెట్టే. ఆయ‌న ఏకంగా గ‌ల్లా అరుణ‌నే 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఓడించారు. దీంతో గ‌ల్లా ఫ్యామిలీ వార‌సురాలు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డ పోటీ చేసినా గెలుపుకోసం శ‌క్తికి మంచి క‌ష్ట‌ప‌డాల్సిందే.

 

గ‌ల్లా ఖాతాలో మరో టీడీపీ టికెట్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share