ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ క‌ష్ట‌మే..!

June 10, 2018 at 11:27 am
East Godavari, Rampachoodavaram, MLA, vanthala rajeswari

అవును! తాజాగా మారిన స‌మీక‌ర‌ణ‌లు తూర్పు గోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వరం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హిళా ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రికి టికెట్ గండాన్ని కొని తెచ్చాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలుపొందిన రాజేశ్వ‌రి.. జ‌గ‌న్‌కు తోడ‌బుట్ట‌ని చెల్లెలిగా వైసీపీలో న‌డ‌యాడారు. అయితే, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా.. ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె పార్టీ మార్పు వెనుక పెద్ద ప్యాకేజీనే ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు ఆమెకు ఇక్క‌డ టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆధిప‌త్య పోరు ఆమెను పైకి ఎద‌గ‌నీయ‌కుండా చేస్తోంద‌ని ఆమె స్వ‌యంగా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా అధికారులు కూడా ఆమె మాట విన‌కుండా టీడీపీ సీనియ‌ర్లు.. అధికారం లేక‌పోయినా.. చెప్పిన‌ట్టు వింటున్నార‌ని వాపోతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకున్నార‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇక్క‌డ టీడీపీలో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి తిష్ట‌వేసిన‌.. టీడీపీ సీనియ‌ర్ల నుంచి మాత్రం తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఎమ్మెల్యేకూడా నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నియోజకవర్గంలో తొలి మూడేళ్లలో పూర్తి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె పార్టీ మార‌డంతో అధికారవర్గాల్లోను, ప్ర భుత్వంలోను పలుకుబడి పెరిగింది. అయితే, ఆమె అనుకున్న విధంగా దూసుకు పోలేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

కొత్తగూటికి చేరినా సులువుగా ఇక్కడి పార్టీ అంశాలపై ఆమె పట్టు సాధించలేకపోయారని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీలో సీనియ‌ర్ల‌తో సమన్వయాన్ని పెంచుకోవడంలో రాజేశ్వరి కొంత వెనుకబడే ఉన్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఆ పనులతో త మను బలపర్చే ప్రయత్నాలు సాగడం లేదన్నది క్యాడర్‌లో వినిపిస్తున్న‌ అసం తృప్తి గళం. ఒకవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్‌ పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే కంటే మైదాన ప్రాంత ఎమ్మెల్యేల ప్రభావమే ఎక్కువ ఉంటోంది. వారి పేరుతోనే ఇక్కడి పనులను మైదాన ప్రాంత కాంట్రాక్ట‌ర్లు కొట్టుకుపోతున్నారు. దీన్ని కట్టడి చేసి అన్ని పనులూ క్యాడర్‌కే దక్కేలా చేయడంలో అధికార పార్టీలో కొత్తగా చేరిన ఆమెకు అంతగా సాధ్యం కావడం లేదనే అంటున్నారు సీనియ‌ర్లు.

వాస్త‌వానికి నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద 276 ముంపు గ్రామాలుంటే అందులో 200 వరకు గ్రామాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. నిర్వాసితులైన గిరిజనులకు వారు కోల్పోయే భూమికి బదులుగా వేరే ప్రాంతంలో భూమిని సమకూర్చే కార్యక్రమాలు, పునరావాస చర్యల్లో పురోగమనం కన్పించడంలేదు. గతంలో నిర్మించిన భూపతిపాలెం ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మిగలగా ముసురుమిల్లి ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్సు ఇంకా పూర్తి కాలేదు. గిరిజనుల ఆరోగ్యం విషయంలో రంపచోడవరంలో ఉన్న ఏరియా ఆస్పత్రిలో రిఫరల్‌ సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వంద పడకల స్థాయికి ఈ ఆస్పత్రి చేరుకుంటున్నా ఆ స్థాయిలో విస్తరణ చర్యలు, వసతులు, వైద్యుల సేవలు లేవు.

ఇవ‌న్నీ సాకారం కావాలంటే ఎమ్మెల్యే చొర‌వ‌తో పాటు.. స‌మ‌న్వ‌యం అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇక‌, ఎమ్మెల్యే మాత్రం మీరు చెప్పిన‌ట్టు విన‌డం లేదు కాబ‌ట్టి.. అంటూ దీర్ఘాలు తీస్తోంది. దీంతో మొత్తంగా ఇక్క‌డ ఆమెకు వ్య‌తిరేక వ‌ర్గం ఏర్ప‌డిపోయింది. ఇదే విష‌యాన్ని అధిష్టానానికి కూడా తెలిపింది. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇస్తే.. మేం పార్టీ మారిపోవాల్సి ఉంటుంద‌ని ఇక్క‌డ నాయ‌క‌త్వం అధిష్టానానికి చెప్పిన‌ట్టు తెలుస్తోంది., మ‌రి చంద్ర‌బాబు ఎలా నిర్ణ‌యిస్తారో చూడాలి.

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ క‌ష్ట‌మే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share