వైసీపీలోకి మ‌రో టాప్ లీడ‌ర్‌..

June 17, 2018 at 11:42 am
Ex minister, kondu morali, congress party senior leader, ysrcp entry

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో క‌కావిక‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ ఉనికిపాట్లు ప‌డుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్కటంటే.. ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవ‌లేక‌పోయింది. ఈసారైనా స‌త్త‌చాచాటాల‌ని చూస్తున్న ఆ పార్టీకి శ్రీ‌కాకుళం జిల్లాలో మ‌రో షాక్ త‌గులుతోంది. జిల్లాకు చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి కొండు ముర‌ళి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వ‌చ్చే నెల‌లో వైఎస్సార్ జ‌యంతి నాడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ద‌ళిత సామాజిక‌వ‌ర్గానికి చెందిన టాప్ లీడ‌ర్ వైసీపీలోకి వెళ్తుండ‌డం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అన‌తికాలంలోనే మంచి గుర్తింపు పొందిన నేత‌గా కొండ్రు ముర‌ళి ఎదిగారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప‌లువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేత‌ల రూటు మారుతోంది. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలోకి వెళ్ల‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. వ‌చ్చే నెల 8న ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆయ‌న‌తోపాటే కొండ్రు ముర‌ళి చేరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి ఆయ‌న టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. వైసీపీలోనే చేరాల‌ని ముర‌ళి నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఆయ‌న‌తో వైసీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అయితే జ‌గ‌న్‌తో కొండ్రు ముర‌ళి చ‌ర్చించారా..? లేదా..? అన్న‌దానిపై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. ప్ర‌స్తుతం.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ఇటీవ‌ల ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత ఉత్త‌రాంధ్ర‌లో కొన‌సాగ‌నుంది. ఇందుకు ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. ఈలోపే వైసీపీలో చేరి, ఉత్త‌రాంధ్ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసి, త‌న స‌త్తాచాటుకోవాల‌ని కొండ్రు ముర‌ళి భావిస్తున్నార‌ట‌.

ఏదేమైనా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టుసాధించాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ మ‌ధ్య కాస్త యాక్టివ్‌గానే ఉంటోంది. ఇటీవ‌లే పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి కూడా ఏపీలో ప‌ర్య‌టించారు. ఇంత‌లోనే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నేత కొండ్రు ముర‌ళి వైసీపీలోకి వెళ్ల‌డం ఖాయం కావ‌డంతో కాంగ్రెస్ వ‌ర్గాలు కంగుతిన్న‌ట్లు తెలుస్తోంది.

వైసీపీలోకి మ‌రో టాప్ లీడ‌ర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share