ప‌వ‌న్‌కు గంటా అదిరిపోయే కౌంట‌ర్‌.. పాతిక ప్ర‌శ్న‌లు!

July 11, 2018 at 9:36 am
Ganta Srinivas, Pawan Kalyan, questioning, 25 questions

టీడీపీ నేత‌ల పాలిటిక్స్ ఎలా ఉంటాయో.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధించిన ప‌వ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునో.. లేక ఎవ‌రైనా డైరెక్ష‌న్ లోనే తెలియ‌దు కానీ.. టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.. తానేన‌ని, త‌న ద‌య‌వ‌ల్లే చంద్ర‌బాబు సీఎం అయ్యార‌ని ఆయ‌న ఇప్ప‌టికీ ప‌దేప‌దే చెబుతున్నారు. ఇక‌, లోకేష్ విష‌యంలోనూ తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాడు. అనుభ‌వం లేకుండా రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దిగాడంటూ.. లోకేష్‌పై నిప్పులు చెరుగుతున్నాడు

ప‌వ‌న్‌. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో నెగ్గాలంటూ.. స‌వాల్ కూడా రువ్వుతున్నారు. “ద‌మ్ముంటే రాజీనామా చేసి రావాల‌ని“ స‌వాల్ కూడా రువ్వాడు. ఈ నేప‌థ్యంలోనేటీడీపీకి చెందిన నాయ‌కుడు, మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ప‌వ‌న్‌కు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చాడు. దాదాపు పాతిక ప్ర‌శ్న‌లు సంధించారు. ప‌వ‌న్ మాట్లాడుతున్న‌వి ఆయ‌న సొంత మాటలా, లేక బీజేపీ స్క్రిప్టా అంటూ విమ‌ర్శిం చారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని ప‌వ‌న్ క‌ళ్లుండీ చూడ‌లేక‌పోతున్నారు అన్నారు. జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ క‌మిటీ ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ. 70 వేల కోట్ల‌కుపైగా ఉన్నాయంటూ నివేదిక ప‌వ‌న్ త‌యారు చేశార‌న్నారు.

కానీ, దాంతో కేంద్రాన్ని నిల‌దీసే ధైర్యం ఎందుకు లేక‌పోయింద‌ని ప్ర‌శ్నించారు. ఏపీకి చెయ్యాల్సిన‌వన్నీ చేశామంటూ సుప్రీం కోర్టులో కేంద్రం త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తే… దానిపై ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌లేద న్నారు? కేంద్రంపై అవిశ్వాసం పెడితే, దేశ‌మంతా ప‌ర్య‌టించి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌న్న ప‌వ‌న్, గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో ఎందుకు మౌనంగా ఉండిపోయార‌న్నారు? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిచేందుకు టీడీపీ క‌ట్టుబ‌డి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింద‌నీ, దానిపై కేంద్రం స్పందించ‌క‌పోతే ఒత్తిడి తెచ్చేలా ప‌వ‌న్ ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు? విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని గంటా ప్ర‌శ్నించారు.

వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ. 350 కోట్లు నిధులు వెన‌క్కి తీసుకుంద‌నీ, విశాఖ‌- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వ‌లేద‌నీ దీనిని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌డ‌ని గంటా ప్ర‌శ్నించారు. మొత్తానికి టీడీపీ నుంచి బ‌ల‌మైన గ‌ళం ఇప్పుడు ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కొస‌మెరుపు ఏంటంటే.. ఇదే గంటా 2009లో ప‌వ‌న్ అన్న చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యంలోకి జంప్ చేసి ఎమ్మెల్యే కావ‌డం. మెగా ఫ్యామిలీకి చాలా స‌న్నిహితంగా మెల‌గడం!!

ప‌వ‌న్‌కు గంటా అదిరిపోయే కౌంట‌ర్‌.. పాతిక ప్ర‌శ్న‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share