గంటా రాజీనామా….జోన్ కే త్యాగం!

May 7, 2018 at 11:20 am
Ganta Srinivas rao, Minister, TDP, Resign, for railway zone, visakhapatnam,

గంటా ప‌థంగా చెప్పుండ్రి ఈ మాట ..ఇనుకోండ్రి ఈ మాట‌.. మంత్రి గోరు ఈ సారి మాంచి జోరుమీదున్న‌రు.. ప‌దవి రాజీనామా చేస్తార‌ట‌.. ఏమో ఊకో సామీ ఊకో ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్బాలు క‌ట్టి పెట్టుండ్రి.. ఇన్నేళ్ల కాలంలో జోన్ కోసం మీరు అనగా గంటా శ్రీ‌నివాస్ గోరూ మాట్లాడారా..ఇంత‌కాలం మీరు కేంద్రం నుంచి రాబట్టింది ఏంట‌ట‌! ఈ ప‌దవుల పందేరంలో మీరంతా హాయిగా ఉన్నారుగా.. ఇంకేం కావాల‌ట‌! సో.. ఇవాళ మిమ్మ‌ల్ని జ‌నం న‌మ్ముతారా.. అస‌లు జోన్ వ‌చ్చేసీన్ ఉందా.. ఎందుకంటే ఇప్ప‌టికే జోన్ వ‌చ్చేందుకు ఎటువంటి సంకేతాలు బీజేపీ ఇవ్వ‌లేదు క‌దా! మ‌రి జోన్ కోసం మీరు త్యాగాలు చేయ‌డం ఏంటి. కామెడీ కాకపోతే..!

 

కాస్తలో కాస్త …

ఆ యువ ఎంపీ రామునే బెట‌ర్.. విశాఖ కేంద్రంగా జోన్ ఇవ్వాల్సిందేన‌ని ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లు ఒక‌టి పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌గ‌లిగారు. ఆపాటి కూడా వేరొక‌రెవ్వ‌రూ చేయ‌లేక‌పోయారు.జోన్ ఎలా తేగ‌ల‌రో గంటా స‌ర్ చెప్ప‌గ‌ల‌రా మీరు. మీరు ఏం త్యాగాలు చేస్తారు ప‌ద‌వీ త్యాగ‌మా చేసి ఏం చేస్తారు.. పోనీ ఎమ్మెల్యే ప‌దవి వ‌దిలి రోడ్డెక్కుతారా.. ఏం చేస్తార‌ని చేయ‌గ‌ల‌రని..

 

మోస‌పో ఆంధ్రుడా 

రైల్వే జోన్‌ సాధన పోరాటంలో ఏ స్థాయి త్యాగానికైనా తొలి వరుసలో ఉంటానని అంటున్నారు గంటా. నిజ‌మేనా.. ఇందాకా వీరు చేసింది ఒక్క‌సారి రివైజ్ చేద్దాం. విజ‌య‌వాడ కేంద్రంగా రైల్వే జోన్ కావాల‌ని రాయ‌పాటి అండ్ కో డ్రామాలు ఆడింది నిజం కాదా.. విశాఖ జోన్ ఇస్తే ఇవ్వండి వాల్తేరు డివిజ‌న్ ని మేం ఏ మాత్రం కోల్పోం అని ఒడిశా స‌ర్కారు తేల్చి చెప్పిన మాట వాస్త‌వం కాదా.. ఆరువంద‌ల కోట్లు  అప్ప‌ణంగా వ‌స్తుంటే ఎలా వ‌దిలేస్తార‌ట‌! క‌నుక  కిరండోల్ టు కొత్త‌కోట లైన్ కూడా ఆదాయం ఇచ్చేదే,.. దానిని కూడా ఒడిశా వదులుకోదు క‌నుక హోదా కోసం  జోన్ కోసం ఎవ‌రేం చెప్పినా అవ‌న్నీ చెవిలో పూలు పెట్టించే కార్య‌క్ర‌మమే అన్న‌ది నిర్వివాదాంశం..బ‌హిరంగ ర‌హ‌స్యం.

 

ఆ రోజు ఎంపీ రాము ఏమ‌న్నారంటే..

ఫిబ్ర‌వ‌రి 14 ఉద‌యం ప్ర‌జాస‌ద‌న్  అన‌గా శ్రీ‌కాకుళం ఎంపీ కార్యాల‌యం..విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఎంపీ  కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నవ్యాంధ్ర‌కు రైల్వే జోన్ ఇవ్వాల్సిందేన‌ని, దీనిపై ఇప్ప‌టికే కేంద్రానికి లేఖ‌లు రాశానని  తెలిపారు. రాష్ట్రానికి జోన్ కేటాయింపుపై విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌స్తావించార‌ని, నాటి హామీని కేంద్రం త‌ప్ప‌క నెర‌వేర్చాల‌ని కోరారు. 

 

అదేవిధంగా ప‌లాస నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కూ ఉన్న ఏడు రైల్వే స్టేష‌న్లూ ఖుర్దా డివిజ‌న్ లో ఉన్నాయ‌ని, వీటిని కూడా కొత్త‌గా ఏర్పాట‌య్యే జోన్ లో ఉంచాల‌న్న‌ది త‌మ డిమాండ్ అని, ముఖ్యంగా వాల్తేరు, గుంత‌క‌ల్లు, విజ‌య‌వాడ, గుంటూరు ఈ నాలుగు డివిజ‌న్లూ క‌లిపి విశాఖ జోన్ గా ఏర్పాటు చేయాల‌ని, అంతేకాక రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేష‌న్ల‌నూ ఈ జోన్ ప‌రిధిలోకే తీసుకుని రావాల‌ని కోరారు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ ప‌రిధిలో ఉన్న ఆ..ఏడు స్టేష‌న్లు అభివృద్ధికి నోచుకోవాలంటే కొత్త జోన్ లో చేర్చ‌డం ద్వారానే సాధ్య‌మ‌ని, లేకుంటే ప్ర‌తి ప‌నికీ మ‌నం భువ‌నేశ్వ‌ర్ అధికారుల చుట్టూ తిర‌గక త‌ప్ప ద‌ని అన్నారు. 

 

విశాఖ జోన్ వ‌స్తే.. 

– విశాఖ టు శ్రీ‌కాకుళం రోడ్ మీదుగా కాశీకి నేరు రైలు ప్ర‌తిరోజూ న‌డిపేట్టు చేస్తే 

ఇందువ‌ల్ల విశాఖ, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం ప‌ర్లాఖిమిడి బ‌రంపురం ఛ‌త్ర‌పూర్ ప్రాంతాల వారికి ప్ర‌యోజ‌న సిద్ధి సాధ్యం. 

– విశాఖ టు తిరుప‌తికి చెన్న‌య్‌కి, ముంబైకి ఢిల్లీకి దురంతో రైళ్లు (నాన్ స్టాప్) వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. 

– ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ కి చెందిన విద్యార్థుల‌కు ఉద్యోగ‌వకాశాలు ఇంత‌వ‌రకూ భువ‌నేశ్వ‌ర్ వెళ్లి మ‌న విద్యార్థులు ఒడిశా వారితో నానా అవ‌స్థ‌లు ప‌డి ప‌రీక్ష‌లు రాయకుండా తీవ్ర అవ‌మానాలు పొంది వెనుదిరుగుతున్నారు.

– కొత్త జోన్ వ‌ల్ల నిధులొస్తాయి.

– ఏటా బ‌డ్జెట్ కేటాయింపుల్లో అన్యాయాన్ని స‌వ‌రించవ‌చ్చు

– న‌డికుడి- కాళ‌హ‌స్తి, కాకినాడ – పిఠాపురం, కోటిప‌ల్లి – న‌ర్సాపురం కొత్త లైన్లు (రైలు మార్గాలు) వేస్తే మ‌న‌కు ప్ర‌యోజ‌నం 

– ఇంత‌వ‌ర‌కూ మ‌నం ఈస్ట్ కోస్ట్ వ‌ల్ల ఆదాయం రాక‌పోయినా త‌మ రాష్ట్రానికి ఒడిశా వారు ఎక్కువ రైళ్లు కేటాయించుకున్నారు. 

కానీ మ‌న‌కు మాత్రం ద‌క్కుతుంది రిక్త హ‌స్త‌మే! 

– జోన్ వ‌స్తే ఒడిశా పెత్త‌నానికి చెక్ పెట్ట‌వ‌చ్చు.

(ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి) 

 

గంటా రాజీనామా….జోన్ కే త్యాగం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share