టీడీపీకి గంటా ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనా..?

June 19, 2018 at 10:22 am
Ganta srinivasrao, TDP, minister, Bheemili constituency, latest survey result,

రాజ‌కీయాల్లో ఓ సామెత ఉంది.. ఎవ‌రినైనా సాగ‌నంపాల‌ని అనుకున్న‌ప్పుడు.. వారిపై మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు ప‌డేలా చేస్తార‌ని! ఇప్పుడు ఇది మంత్రి గంటా శ్రీనివాస‌రావు విష‌యంలో అక్ష‌రాలా స‌త్య‌మ‌ని రుజువు అవుతోంది. రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి భేష్‌గా ఉంద‌ని తాజాగా ఆర్జీస్ స‌ర్వే పేరిట ఆంధ్రా ఆక్టోప‌స్‌, మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఫ్లాష్ టీం పెద్ద ఎత్తున స‌ర్వే రిజ‌ల్ట్ వెల్ల‌డించింది. ఈ స‌ర్వేలో.. 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని ఒడ‌బోసిన‌ట్టు స‌ర్వే చేసిన వారు చెప్పుకొచ్చారు. అయితే, ఇక్క‌డే కొంద‌రు టీడీపీ నేత‌ల ప‌రిస్థితి బాగోలేద‌ని చెప్పుకొచ్చారు.

వీరిలో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు గంటా శ్రీనివాస‌రావు. ఈయ‌న రెబ‌ల్ నాయ‌కుడ‌నే పేరు తెచ్చుకున్నారు. త‌న‌కు అనుకూలంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేయ‌డం ఈయ‌న‌కు రాజ‌కీయంగా అబ్బిన ప్ర‌ధాన విద్య‌! ఇక‌, ఈయ‌న విశాఖ‌లో చేసిన భూకుంభ‌కోణాల‌పై సొంత పార్టీ మంత్రిగారే ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ ఏకేశారు. ఫ‌లితంగా చంద్ర‌బాబే స్వ‌యంగా జోక్యం చేసుకుని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌,గంగా ఫ్యామిలీ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించి అందిన కాడికి నొక్కేస్తోంది. ఈ ప‌రిణామంపై చంద్ర‌బాబు ప‌లుమార్లు హెచ్చ‌రించారు కూడా అయినా గంటా ప‌ద్ధ‌తి మాత్రం మానుకోలేదు.

పాఠ‌శాల‌ల‌కు రంగులు వేసే కాంట్రాక్టు విష‌యంలోను, వేలిముద్ర‌ల యంత్రాల విష‌యంలోను ఆయ‌న చేతి వాటం ప్ర‌ద‌ర్శించ‌డంపై నేరుగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కే ఫైళ్ల వెళ్లాయి. దీంతో ఎలాగైనా ఆయ‌నను సాగ‌నంపాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు. అయితే, రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కుడు కావ‌డం, కాపు వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఆయ‌న‌పై నేరుగా చ‌ర్య‌ల‌కు దిగితే ఫ‌లితం రివ‌ర్స్ అవుతుంద‌ని బాబు భావించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఆర్జీస్ స‌ర్వే సాయం చేసింద‌ని అంటున్నారు గంటా మ‌ద్ద‌తు దారులు. నిజానికి స‌ర్వే వెల్ల‌డించిన ఫ‌లితాల్లో అనేక లోపాలు ఉన్నాయ‌ని, వీరు స‌ర్వే చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తీవ్ర‌మైన కేసులు ఎదుర్కొంటున్నార‌ని, అయినా కూడా వారిపై మాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చార‌ని వీరు చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌.అంతేకాదు.. గుర‌జాల ఎమ్మెల్యేకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే చెప్పింద‌ని, కానీ, ఆయ‌న‌పై లేట‌రైట్ మైనింగ్ కేసుల్లో కోర్టుల్లో కేసులు మూలుగుతున్నాయ‌న్న విష‌యం మ‌రిచిపోయార‌ని అంటున్నారు.

అదేవిధంగా.. అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై విశాఖ భూక‌బ్జా కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ప్ర‌భుత్వం నియమించిన సిట్ కేసు న‌మోదు చేసింద‌ని, ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే పై భూక‌బ్జా కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నార‌ని, అయినా కూడా వీరిపై మాత్రం క్లీన్ చిట్ ఇచ్చార‌ని అంటున్నారు. కేవ‌లం ఉద్దేశ పూర్వకంగా గంటాను సాగ‌నంపాల‌నే ఏకైక ల‌క్ష్యంతోనే స‌ర్వే ఫ‌లితాల్లో ఆయ‌న‌ను త‌క్కువ చేసి చూపించార‌ని అంటున్నారు. భీమిలిలో ఒంట‌రిగా పోరు చేసినా.. అత్య‌ధిక మెజార్టీతో గెలిచే స‌త్తా గంటాకు ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి స‌ర్వే మ‌త‌ల‌బు ఏంటో..?

టీడీపీకి గంటా ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share