వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే అవ‌మానాల‌కు లెక్కే లేదు..

December 13, 2017 at 11:54 am
YSRCP, TDP, Jumping MLA, Giddalur, Ashok Reddy

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉన్న అశోక్‌రెడ్డికి జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చి ఫైనాన్షియ‌ల్‌గా కూడా సాయం చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచిన అశోక్‌రెడ్డికి వైసీపీ జిల్లా ప‌గ్గాలు కూడా అప్ప‌గించారు. జిల్లాలో ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నా కూడా అశోక్‌రెడ్డి మీద న‌మ్మ‌కంతో జ‌గ‌న్ ఆయ‌నకు పార్టీలో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అశోక్‌రెడ్డి షాక్ ఇస్తూ టీడీపీలో చేరిపోయారు. 

వైసీపీ త‌ర‌పున తాము గెలిపిస్తే అశోక్‌రెడ్డి టీడీపీలో చేర‌డంతో ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అశోక్‌రెడ్డి టీడీపీ ఎంట్రీని అక్క‌డ టీడీపీ నాయ‌కులు అంగీక‌రించ‌డం లేదు…ఇటు తాము గెలిపిస్తే టీడీపీలోకి వెళ్లాడంతో వైసీపీ వాళ్లు కూడా ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారిపోయింది. పార్టీ మారిన‌ప్ప‌టి నుంచి అశోక్‌రెడ్డి వ‌రుస అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి.

People-stun-Local-MLA-during-Intintiki-TDP-1506440122-187

టీడీపీ, వైసీపీ రెండు పార్టీల వాళ్లు ఆయ‌న్ను నిల‌దీస్తున్నారు. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ పర్యటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది.  ఈ దాడికి గ్రామ స‌ర్పంచ్ కార‌ణ‌మ‌ని భావించిన ఎమ్మెల్యే అనుచ‌రులు సర్పంచ్ బంధువులైన నలుగురు యువకులపై దాడి చేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే అశోక్‌రెడ్డికి ప్ర‌తి రోజు ఎక్క‌డో ఓ చోట అవ‌మానం ఎదుర‌వుతూనే ఉంది.

ఆయ‌న బ‌య‌ట‌కు వస్తే ఎక్క‌డో ఓ చోట టీడీపీ కార్య‌క‌ర్త‌లో, వైసీపీ వాళ్లో నిల‌దీస్తూనే ఉంటున్నారు. అభివృద్ది కోస‌మే టీడీపీలో చేరాన‌ని చెపుతోన్న ఆయ‌న ఏం అభివృద్ది చేశారో చెప్పాలని వైసీపీ వాళ్లు ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇక టీడీపీ వాళ్లు అయితే సొంత అభివృద్దే తప్ప నియోజకవర్గాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాలని అందరిముందు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో అశోక్‌రెడ్డి ప్ర‌తిసారి మౌనంగానే అక్క‌డ నుంచి వెళ్లిపోతున్నారు.

వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే అవ‌మానాల‌కు లెక్కే లేదు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share