క‌నీసం ఇద్ద‌రిని క‌నండి.. గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

June 13, 2018 at 3:42 pm
Gova Governer, two children, should berth, society, Message

బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖ‌రికి గ‌వ‌ర్న‌లు కూడా నిత్యం ఏదో అంశంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ఈ మ‌ధ్య త‌రుచూ జ‌రుగుతూనే ఉంది. ఏదో ఒక కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం.. అక్క‌డ సంబంధం లేని విష‌యాలు ప్రస్తావించడం బీజేపీ నేత‌ల‌కు ప‌రిపాటిగా మారింది. తాజాగా.. గోవా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మృదులా సిన్హా కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. బెల్గావిలో నిర్వ‌హించిన కేఎల్ఈ అకాడ‌మీ స్నాత‌కోత్స‌వంలో ఆమె ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఇప్పుడు యువ‌తీయువ‌కులు క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నాల‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఒక్క‌రితోనే ఆగ‌వ‌ద్ద‌ని ఆమె సూచించారు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నారు.

ఇదే సమ‌యంలో కుటుంబాల సంబంధాలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో కూడా ఆమె వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.
అయితే గోవా రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా చేసిన వ్యాఖ్య‌ల‌కు ప‌లువురు మ‌ద్ద‌తు కూడా తెలుపుతున్నారు. నిజానికి ఇప్పుడు చాలా కుటుంబాలు బాంధ‌వ్యాల సంక్షోభంలో ఉన్నాయ‌నీ.. ఇలాంటి స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయ‌ని అంటున్నారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే వారు చిన్న‌త‌నంలో కలిసి చదువుకుంటారని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. యువతీ, యువకులందరూ తప్పని సరిగా పెళ్లి చేసుకోవాలని, వృద్ధ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపించవద్దని ఆమె సూచించారు.

అంతేగాకుండా భార్యలను బాగా చూసుకోవాలని యువ‌కుల‌కు మృదులా సిన్హా సూచించారు. అయితే ఆమె వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తుండ‌గా మ‌రికొంద‌రు కొట్టిపారేస్తున్నారు. నిజానికి.. ఎంద‌ర్ని క‌నాల‌న్న అంశంపై చాలా యేళ్లుగా పెద్ద లొల్లే జ‌రుగుతోంది. జ‌నాభాను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు కూడా అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఒక్క‌రు ముద్దు.. ఇద్ద‌రు హ‌ద్దు.. ముగ్గురు వ‌ద్దు.. ఇలాంటి నినాదాల‌తో ప్ర‌భుత్వాలు జ‌నాభా నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

అయితే.. కుటుంబంలో ఒక్క‌రే ఉంటే.. పెద్ద‌య్యాక కెరీర్ దృష్ట్యా ఇత‌ర ప్రాంతాల‌కు, విదేశాల‌కు వెళ్తున్నారు. త‌ల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వ‌చ్చేట‌ప్ప‌టికీ వారు ఒంట‌రిగా మిగిలిపోతున్నారు. ఇక ఉన్న ఒక్క‌రు కూడా అనుకోని ప‌రిస్థితుల్లో దుర్మ‌ర‌ణం పాలైతే.. ఇక ఆ త‌ల్లిదండ్రులు ఎవ‌రూ లేకుండా ఉండిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే రోజురోజుకూ దేశంలో వ‌ద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

క‌నీసం ఇద్ద‌రిని క‌నండి.. గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share