జనంతో జగన్.. రూట్ మ్యాప్ సిద్ధం..

March 15, 2019 at 5:41 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఈ నెల 16 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇడుపుల‌పాయ‌లో పార్టీ అభ్య‌ర్థుల తొలిజాబితాను ప్ర‌క‌టించిన త‌ర్వాత జ‌గ‌న్ అక్క‌డిన ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌తో దాదాపుగా ఏడాదిపాటు రాష్ట్ర‌మంత‌టా ప‌ర్య‌టించిన జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వ్యూహాత్మ‌కంగా చేప‌డుతున్నారు. ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో తిర‌గ‌లేని ప్రాంతాల‌ను ఆధారంగా చేసుకుని జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం సాగుతుందుని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. హెలిక్యాప్ట‌ర్ లో జ‌గ‌న్ స‌భ‌ల‌కు వెళ్లేందుకు అంతా సిద్ధ‌మైంది.

అంతేగాకుండా…ఇటీవ‌ల వ‌రకు పార్టీ బూత్ క‌మిటీ కార్య‌క‌ర్త‌లు, ముఖ్య‌నాయ‌కుల‌తో స‌మ‌ర‌శంఖారావం స‌భ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అనుస‌రించాల్సిన వ్యూహాంపై జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. నిజానికి.. ఈ స‌మ‌ర‌శంఖార‌వం స‌మావేశాల‌తో జ‌గ‌న్ స‌రికొత్త ఒర‌వ‌డి సృష్టించారు. స‌మావేశంలో మాట్లాడిన త‌ర్వాత ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన దారిపై జ‌గ‌న్ న‌డుస్తూ కార్య‌క‌ర్త‌ల అనుమానాల‌ను నివృత్తి చేశారు. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు.

ఇక ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ కూడా ఖ‌రారు అయింది. ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌చారం ప్రారంభిస్తారు. తొలి స‌భ గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోని పిడుగురాళ్ల‌లో ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఈనెల 20వ‌ర‌కు రోజుకు మూడు స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. ఇక‌ రెండోదశలో 21వ తేదీ నుంచి ఏప్రిల్ 1వరకు రోజుకు 4 సభల్లో జ‌గ‌న్‌ పాల్గొంటారు. ఆ త‌ర్వాత‌ ఏప్రిల్ 1 నుంచి రోజుకు 5 సభల్లో జ‌గ‌న్ ప్ర‌సంగించేలా పార్టీ నాయ‌క‌త్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

జనంతో జగన్.. రూట్ మ్యాప్ సిద్ధం..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share