పవన్ తొలి ఎమ్మెల్యే టికెట్ వలసనేతకే!

September 11, 2018 at 7:31 pm

‘‘తనకు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి… ఇక ఎప్పటికీ నేనే సీఎంగా కావాలని అనుకునే విధంగా పరిపాలన అందిస్తా’’ అనే నినాదంతో రాజకీయాలను ప్రారంభించిన జనసేన అధినేత , హీరో పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున తొలి ఎమ్మెల్యే టికెట్ ను మంగళవారం శుక్లపక్ష విదియ తిథి నాడు ప్రకటించారు. దాదాపు అయిదేళ్ల ముందు పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటూ.. తమ పార్టీ తరఫున తొలి టికెట్ ను ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చిన వలసనేతకే ఇవ్వడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణ కు పవన్ తొలి టికెట్ ప్రకటించారు.

పితాని బాలకృష్ణ అంటే గతంలో ఆయన కానిస్టేబుల్ గా పనిచేశారు. అప్పట్లో ఆయనకు జగన్ అవకాశం రాజకీయ అవకాశం ఇవ్వడంతో.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని కూడా చేశారు. అయితే , శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ, రకరకాల రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని… పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి దగ్గరవుతున్నట్లుగా సంకేతాలు రావడంతో.. జగన్ పక్కన పెట్టారు. తీరా ఇవాళ ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Dmzbb7qV4AAGpsj

పితాని బాలకృష్ణ మంగళవారమే హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటికప్పుడే.. పవన్ ఆయనకు తొలి టికెట్ ను ప్రకటించేశారు. చూస్తున్న వాళ్లందరినీ కూడా ఈ నిర్ణయం విస్మయపరిచింది. ఏదో టికెట్ ఇవ్వకపోతే ఆయన అసలు పార్టీలో చేరడేమో అన్నంత అర్జంటుగా వలస వచ్చిన నాయకుడికి అప్పటికప్పుడు తొలి టికెట్ ప్రకటించేయడంతో ఆల్రెడీ చాలాకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారు కూడా ఖంగుతిన్నారు.

సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించి.. అయిదేళ్లు అయింది. కనీసం రెండేళ్లుగా ఆయన కొందమంది నాయకులను పార్టీలో ఉంచుకుని.. కీలకంగా సమావేశాలు నిర్వహిస్తూ నడిపిస్తున్నారు. సుమారు ఏడెనిమిది నెలలనుంచి వచ్చే ఎన్నికల్లో పూర్తిగా స్వతంత్రంగా పోటీచేయాలనే ఉద్దేశంతో ముమ్మరంగా నాయకులను చేర్చుకుంటూ పార్టీని తనకు చేతైనంత బలోపేతం చేసుకుంటున్నారు. అయితే ఇంతకాలంగా పార్టీని ఏం తయారుచేశారో ఏమో గానీ.. తొలి టికెట్ ను ఇవాళే వలసవచ్చిన నాయకుడికి ఇవాళే ప్రకటించడం అనేదే తమాషా!

DmzbdNOUcAAnXK2

పవన్ తొలి ఎమ్మెల్యే టికెట్ వలసనేతకే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share