99టీవీపై జ‌న‌సేన సైనికుల గుర్రు

October 8, 2018 at 11:17 am

ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి.. ప‌వ‌న్ మాట‌లు ఉరుముతున్నాయి.. ఆయ‌న త‌రుపున అరిచేవాళ్లూ రెచ్చిపోతున్నారు.. కానీ వీరంద‌రికీ అవ‌స‌ర‌మైన 99టీవీ మాత్రం కుదురుకోలేక‌పోతోంది. దీనిపై జ‌న‌సేన సైనికులు గుర్రుగా ఉన్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. ఇంకా ఛాన‌ల్ బాలారిష్టాలు దాట‌క‌పోవ‌డంపై వారు తీవ్ర అసంత‌`ప్తితో ఉన్నారు. ఛాన‌ల్‌పై ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. నిజానికి.. వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నజ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిమాట‌లు చెబితే మాత్రం ఏం లాభం.. టీడీపీ, వైసీపీ, బీజేపీల‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తేనేం.. అవ‌న్నీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌న‌ప్పుడు. జ‌న‌సేనాని వేగాన్ని ఛాన‌ల్ 99టీవీ అందుకోక‌పోవ‌డంపై శ్రేణులు మండిప‌డుతున్నాయి. ఛాన‌ల్ బాగుంటే.. జ‌న‌సేన వాయిస్ జ‌నంలోకి బ‌లంగా వెళ్తుంద‌నీ.. అప్పుడే ప్ర‌జాద‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నాయి.

upto-which-extent-99-tv-hel

నిజానికి.. రాజ‌కీయాల్లో సొంత ఛాన‌ల్ ఎంత అవ‌స‌ర‌మో ప‌వ‌న్‌కు ప్ర‌జారాజ్యం పార్టీ స‌మ‌యంలోనే అర్థ‌మైంది. ఆ త‌ర్వాత ఆయ‌న సొంతంగా జ‌న‌సేన పార్టీని పెట్టిన త‌ర్వాత ఈ విష‌యంలో ఆయ‌న‌కు మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. హీరోగా ఇచ్చిన ప్రియారిటీ పొలిటిషియ‌న్‌గా అవ‌తారం ఎత్తిన త‌ర్వాత ఉండ‌దని ఆయ‌న స్ప‌ష్టంగా తెలుసు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖ‌ర్ 99టీవీని ద‌క్కించుకోవ‌డంతో ఇక త‌మ‌కూ ఓ ఛాన‌ల్ ఉంద‌ని జ‌న‌సేన సైనికులు సంబుర‌ప‌డిపోయారు. కానీ.. అది ఇప్ప‌టికీ కుదురుకోలేక‌పోవ‌డం.. కార్య‌క్ర‌మాలు స‌రిగా లేక‌పోవ‌డంతో వారు తీవ్ర అసంత‌`ప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ ఛాన‌ల్‌ను రెండు స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఒక‌టేమో సాంకేతికంగా.. మ‌రొక‌టి కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న ఆక‌ట్టుకునేలా ఉండ‌క‌పోవ‌డం.

99టీవీ.. తెలుగులో ఒక ఇరవై న్యూస్ ఛాన‌ళ్లు ఉంటాయి. ఇక వీటిలో 99టీవీ స్థానం 18 లేదా 19 లో ఉంటోంది. మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 కి 70 పాయింట్ల దాకా రేటింగ్ ఉంటే, 99టీవీ 4 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఛాన‌ల్ ప‌రిస్థితి ఏమిటో. ఇప్పటికీ చాలా చోట్ల ఈ ఛానల్ రావడం లేదు. హైదరాబాద్ నగరంలోనే బ్రైట్ వే లాంటి ఆపరేటర్లు ఈ ఛానల్ ని బ్లాక్ చేశారు. బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ ఛానల్ డీటీహెచ్‌లో రావ‌డం లేదు. అయితే కొద్దిరోజులుగా వీడియోకాన్ లో వస్తున్నప్పటికీ తెలుగు ప్ర‌జ‌లు దీనిని ఉప‌యోగించ‌డం త‌క్కువే మ‌రి. ఈ ఛానల్ యొక్క శాటిలైట్ లింక్ నోయిడా కు వెళ్లి నోయిడా నుండి రీ-కాస్ట్ అవ్వాల్సి రావడంతో క్వాలిటీ లోపిస్తోందని యాజమాన్యం చెబుతోంది. అయితే.. ఈ అన్ని స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతామ‌ని అంటోంది.

99టీవీపై జ‌న‌సేన సైనికుల గుర్రు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share