చిక్కుల్లో జ‌న‌సేన‌.. ప‌క్కా ఆధారాలున్నాయా..!

December 17, 2017 at 10:33 am
janasena, pawan kalyan, Guntur, party office, area, Muslims

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌య నిర్మాణం ఆదిలోనే స‌మ‌స్య‌లతో ప్రారంభ‌మైంది. ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌న్‌ను ముస్లింలు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు. వారి స్థ‌లాన్ని తీసుకోవ‌డం ఏమిట‌ని అడుగుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ వివాదం చినుకు చినుకు గాలి వానైన‌ట్టుగా మారింద‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ రాజ‌ధాని ప్రాంతం గుంటూరు జిల్లా చినకాకానిలో రాష్ట్ర కార్యాలయం కోసం జనసేన పార్టీ  మూడు ఎక‌రాల స్థ‌లాన్ని లీజుకు తీసుకుంది. దీనిని ఇటీవ‌ల ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ కూడా సంద‌ర్శించాడు. అ స్థ‌లంలో నిర్మించే పార్టీ కార్యాల‌యాన్ని మేధావుల‌కు నిల‌యంగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించాడు. 

అతి పెద్ద రాజ‌కీయ గ్రంథాల‌యంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు. అయితే, ప‌వ‌న్ ప‌ర్య‌టించి వెళ్లిన తెల్లారే.. ఈ స్థ‌లం త‌మదంటూ.. ముస్లింలు ఆందోళన‌కు దిగారు. ప‌క్కా ఆధారాలతో ముస్లిం ఐక్యవేదిక నాయకులు తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక నేత జలీల్ మాట్లాడారు. జనసేన పార్టీతో మాకు ఎలాంటి విభేదాలు లేవని ముస్లిం నాయకులు తెలిపారు. ముస్లిం నేతలను దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాభూముల్ని ఎందుకు తీసుకున్నారని అడిగితే కేసులు పెడతారా? అని జలీల్ ప్రశ్నించారు. ఈ స్థ‌లం త‌మ‌ద‌ని, దీనిని పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఈ స్థ‌ల వివాదంపై ప‌వ‌న్ కూడా ఇటీవలే స్పందించారు. 

త్వరలోనే న్యాయ నిపుణులతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, భూ యజమానులు తమ డాక్యుమెంట్లు వారికి ఇవ్వాలని ఓ ప్రకటనలో సూచించారు. స్థలం ముస్లింలదేనని నిర్థారణ అయితే జనసేన ఆ స్థలానికి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాలకు మాత్రమే జనసేన లీజుకు తీసుకుందని, అందువల్ల ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ స్థ‌లం ముస్లింల‌దేన‌ని చెప్పేందుకు ఉన్న ఆధారాల‌ను ఐక్య వేదిక ప్ర‌ద‌ర్శించ‌డం ఇప్పుడు వివాదాన్ని కీల‌క మ‌లుపు తిప్పింది. మ‌రి ఈ విష‌యంలో జ‌న‌సేన అడుగులు వెన‌క్కి వేయ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఆదిలోనే ప‌వ‌న్‌కు ఇలా దెబ్బ‌త‌గ‌ల‌డంపై అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

 

చిక్కుల్లో జ‌న‌సేన‌.. ప‌క్కా ఆధారాలున్నాయా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share