పవన్ కు ఎదురుతిరిగిన జనసైనికులు

May 22, 2018 at 3:50 pm
Janasena, Pawan Kalyan, Srikakulam, Prajaporata Yatra, Pawan fans, darna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్త‌రాంధ్ర‌లో పోరాట యాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోరాట యాత్ర ప్రారంభ‌మైంది. ప‌వ‌న్ 45 రోజుల పాటు ఉత్త‌రాంధ్ర‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తిర‌గాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ప‌వ‌న్ యాత్ర ప్రారంభ‌మైన రెండు మూడు రోజుల‌కే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నుంచే నిర‌స‌న సెగ‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. 

 

తాజాగా ప‌వ‌న్ పోరాట యాత్ర ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ఇక్క‌డ ప‌వ‌న్‌కు పెద్ద ఎత్తున నిర‌స‌న సెగ‌లు త‌గులుతున్నాయి. ప‌లాస‌లో ప‌వ‌న్ బస చేసిన కళ్యాణ్ మండపం ఎదుట ఆ పార్టీ కార్యకర్లు ధర్నాకు దిగారు. సోమ‌వారం ప‌లాస‌కు చేరుకున్న ప‌వ‌న్ అక్క‌డ ఓ క‌ళ్యాణ మండ‌పంలో ఉన్నారు. ఉద‌యం అక్క‌డ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు ప్రారంభ‌మైన వెంట‌నే ఆ క‌ళ్యాణ మండ‌పం వ‌ద్ద జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

 

తాము ప‌వ‌న్ వీరాభిమానులుగా ఉన్నామ‌ని, జ‌న‌సేన ఆవిర్భావం నుంచి కార్య‌క్ర‌మాలు చేస్తుంటే ప‌వ‌న్ త‌మ‌ను కాద‌ని మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావుకు అత్యధిక ప్రాధాన్యమివ్వడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ పూర్ణచంద్రరావుకు ప్రాధాన్యమివ్వడమేంటని వారు ధ్వ‌జ‌మెత్తారు.

 

అలాగే ప‌వ‌న్‌ను చూసేందుకు ఎన్నో ఇబ్బందులు ప‌డి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళుతోన్న ప‌వ‌న్ వీరాభిమానుల‌తో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌వ‌న్ బౌన్స‌ర్లు నెట్టివేయ‌డంతో పాటు వారిపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. దీనిపై కూడా అభిమానులు ఫైర్ అవుతూ తాము ప‌వ‌న్‌ను చూసేందుకు ఉత్సాహంతో ఉంటే బౌన్సర్లు నెట్టేస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

 

పవన్ కు ఎదురుతిరిగిన జనసైనికులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share