జ‌న‌సేన‌కు వైసీపీ ఓట్లు.. మ‌రి టీడీపీకో..?!

June 18, 2018 at 10:23 am
Janasena, YSRCP, TDP, Survey, result, andhra pradesh

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా మారుతుంది? ఎవ‌రు ఎవ‌రి ప‌క్షం వ‌హించ‌నున్నా రు? ఎవ‌రి ఓట్లు గ‌ల్లంత‌వుతాయి? ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అధికార పార్టీచేస్తున్న ప్ర‌చారానికి, ప్ర‌జ‌ల ప‌ట్ల చూపిస్తున్న ప్రేమ‌కు పెరిగ‌నున్న ఓట్ల శాతం ఎంత‌? అనేవి కీల‌క చ‌ర్చ‌నీయాశంగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. ఆర్జీస్ స‌ర్వేలో..అధికార టీడీపీకి 44.04% ఓట్లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో వైసీపీకి 37.46% ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. నిజానికి బాబు చేస్తున్న అభివృద్ధికి ఏపీలో ప్ర‌జ‌లంతా ఆయ‌న‌కే ఓటు వేసి ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌డం లేద‌నేది కీల‌క పాయింట్‌. ఇక‌, ఈ స‌ర్వేలో తేలిన మ‌రో వాస్త‌వం.. ఎటూ తేల‌ని ఓట‌ర్లు.. 5.4%గా ఉన్నారు.

వీరు ఎవ‌రికి ఓటు వేసేదీ చెప్ప‌లేదు. ఒక‌వేళ వీరు బాబుకు ఓటేస్తే.. ఆయ‌న‌కు, వైసీపీకి ఓటేస్తే.. జ‌గ‌న్‌కు మెజారిటీ పెరుగుతుంద‌నే తెలుస్తున్న విష‌యం. అయితే, చంద్ర‌బాబు నాలుగేళ్లు తాను ప‌నిచేస్తున్నాన‌ని, కూలి ఇవ్వాల‌ని అడుగుతున్నా.. జ‌గ‌న్ ఏమీ అడ‌గ‌క పోయినా.. జ‌నాలు మాత్రం జ‌గ‌న్‌కు వేసే ఓట్లు వేస్తున్నార‌ని ఈ స‌ర్వే చెప్పు కొచ్చింది. ఈ రెండు పార్టీల మ‌ధ్య తేడా కూడా ఓ ట్ల శాతం ప్ర‌కారం 1శాత‌మే! ఇదిలావుంటే.. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీకి 8 నుంచి 9% ఓట్లు వ‌స్తాయ‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ ఓటు బ్యాంకు మాత్రం వైసీపీ నుంచి చీలిపోయి.. ప‌వ‌న్‌కు మెజారిటీ పెరుగుతుంద‌న్న‌ది స‌ర్వే సారాంశం.

ఇక్క‌డే, విమ‌ర్శ‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న బాగున్న‌ప్పుడు.. వైసీపీఓటు బ్యాంకు చీలినా.. టీడీపీకి ఎవ‌రూ మొగ్గు చూపించ‌డం లేదేమ‌నేది సందేహం. అంటే.. జ‌న‌సేన వ‌ల్ల‌… ప‌వ‌న్ ప్ర‌చారం వ‌ల్ల ఒక్క వైసీపీకే న‌ష్టం త‌ప్ప‌.. టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేద‌ని ఈ స‌ర్వే చెప్పుకొచ్చింది. నిజానికి ప‌వ‌న్ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న పాల‌న‌లో అవినీతి పెరిగింద‌ని, అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌వ‌న్ చెబుతున్నారు.

మ‌రి అలాంటిస‌మ‌యంలో టీడీపీ ఓటు బ్యాంకు నుంచి జ‌న‌సేన‌కు ఓట్లు ప‌డే అవ‌కాశం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. కానీ, ఈ స‌ర్వేలో మాత్రం అలాంటి ఛాయ‌లు క‌నిపించ‌లేదు. ప‌వ‌న్ టీడీపీని విమ‌ర్శించినా.. వైసీపీ ఓట‌ర్లే స్పందిస్తార‌ని, వైసీపీ ఓటు బ్యాంకుకే న‌ష్టం వాటిల్లుతుంద‌నే కోణంలో ఈ స‌ర్వే సాగింది.మొత్తంగాస‌ర్వే ఫ‌లితం ఎలా ఉన్నా.. సాగిన తీరు. విశ్లేష‌ణ‌పై మాత్రం పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి.

జ‌న‌సేన‌కు వైసీపీ ఓట్లు.. మ‌రి టీడీపీకో..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share