ప‌శ్చిమ‌పై జ‌న‌సేన ర‌హ‌స్య స‌ర్వే.. ప్లాన్ ఇదే!

October 12, 2018 at 12:19 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ 2014 ఎన్నిక‌ల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క‌పోయినా.. 2019 ఎన్నిక ల‌ను మాత్రం ప్ర‌భావితం చేసేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. వాస్త‌వానికి పార్టీ పెట్టి నాలుగున్న‌రేళ్లు దాటిపో యినా వ్య‌వ‌స్తాగ‌తంగా ప‌ట్టు సాదించ‌క‌పోయినా.. గ‌డిచిన ఏడెనిమిది నెల‌లుగా మాత్రం ప‌వ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నా రు. అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు విప‌క్షం వైసీపీని కూడా ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న నిక్క‌చ్చి గా మాట్లాడుతున్నారు. కులాల‌కు అతీతంగా ప‌వ‌న్ రాజ‌కీయాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఒక్కొక్క జిల్లాను టార్గెట్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం, ఇక్క‌డ నుంచి కీల‌క నాయ‌కుల‌ను పార్టీ త‌ర‌ఫున నిల‌బెట్టి గెలిపించుకోవ‌డంపై ఆయ‌న దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది అయితే, వ‌చ్చిన‌ప్ర‌తి ఒక్క‌రికీ, అడిగిన ప్ర‌తి ఒక్క‌రికీ టికెట్ ఇవ్వ‌కుండా చాలా ప‌క‌డ్బందీగా టికెట్లు ఇవ్వాల‌ని జ‌న‌సేనాని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెద్ద ఎత్తున ర‌హ‌స్యంగా స‌ర్వే చేయిస్తున్నార‌ని స‌మాచారం. అభ్య‌ర్థుల ఆర్ధిక స్థోమత, రాజకీయ అనుభవం, ఇతర పార్టీల అభ్యర్ధులతో పోటీపడే స్థాయి వంటి అనేక అంశాల ప్రాతిపదికగా అభ్యర్థుల వడపోత సాగిస్తున్నారట. బీజేపీ, టీడీపీ, వైసీపీల నుంచి వచ్చే నాయకులు ఎవరు? ఎటువంటి పరిస్థితుల్లో వారు జనసేనలో చేరే అవకాశం ఉంది? అన్న అంశాలపై స‌ర్వే కీల‌క దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది.

ఇక‌, ఈ స‌ర్వేను కూడా ఏదో తూ.తూ.. మంత్రంగా కాకుండా ప‌టిష్టంగా నిర్వ‌హించి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఈ స‌ర్వేకి మాజీ పోలీసు అదికారుల‌ను, ముఖ్యంగా ఇంటిలిజెన్స్‌లో ప‌నిచేసిన వారిని వినియోగించుకుంటున్నార‌ని స‌మాచారం. వీరైతే.. అభ్య‌ర్థుల‌ను ఖ‌చ్చితంగా ఎంపిక చేయ‌గ‌ల‌ర‌ని, వారికి సంబంధించిన స‌మాచారాన్ని పూర్తిగా వివిధ కోణాల్లో సేక‌రించ‌గ‌ల‌ర‌ని భావించిన ప‌వ‌న్ వారికి ఈ బాధ్య‌త అప్ప గించిన‌ట్టు తెలుస్తోంది. దీంతోరంగంలోకి దిగిన స‌ర్వే బృందం ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌ల పేర్ల‌తో ఓ నివేదిక‌ను రూపొందించి ప‌వ‌న్‌కు కూడా అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఆయా వ్య‌క్తుల‌ను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇవ్వాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇదే క‌నుక స‌క్సెస్ అయితే.. జిల్లాలో టీడీపీ కంచుకోట‌లు కూల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

ప‌శ్చిమ‌పై జ‌న‌సేన ర‌హ‌స్య స‌ర్వే.. ప్లాన్ ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share