బాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జేసీ!

July 19, 2018 at 9:42 am
JC Diwakar reddy, Chandra babu, comments, not attending parliament sessions,

ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు తాను హాజ‌ర‌య్యేది లేదంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ప్ర‌భుత్వంపై తెలుగుదేశంపార్టీ ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానం శుక్ర‌వారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. కాబ‌ట్టి ఎంపిలంద‌రూ పార్ల‌మెంటుకు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రవ్వాలంటూ టిడిపి విప్ కూడా జారీచేసింది.

ఇక్క‌డే జెసి అడ్డం తిరిగారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్ర, సోమవారాల్లో ఉభయసభలకు తమ ఎంపీలందరూ హాజరు కావాలని ఆ విప్ లో ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టించుకోవట్లేదు.

1482333370-8954

విప్ జారీ చేసినప్పటికీ తాను ఢిల్లీకి వెళ్లేది లేదంటూ సొంత పార్టీకి షాక్ ఇచ్చిన జేసీ ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేము ఎందుకు అవిశ్వాసతీర్మానం పెడుతున్నామన్న విషయాన్ని మా కొలీగ్స్ చాలా క్లియర్ గా చెబుతారు. కనుక, నేను వెళ్లినా, వెళ్లకపోయినా పెద్ద ప్రమాదం లేదు. నా అభిప్రాయం ప్రకారం, ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకూ ఏమీ రాదు.

TH16SOUTHDIWAKARREDDY

అంతే కాదు త‌న‌కు ఇంగ్లీష్ కానీ హిందీ కాని రాద‌న్నారు. తెలుగు త‌ప్ప మ‌రే భాష రాని తాను పార్ల‌మెంటు స‌మావేశాల్లో పాల్గొని ఏం చేయాలంటూ ఎదురు ప్ర‌శ్నించారు. పైగా త‌మ పార్టీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం వ‌ల్ల మోడి ప్ర‌భుత్వం ఏమ‌న్నా ప‌డిపోతుందా ? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ సమావేశాలకు హాజరుకావడం లేదనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి చెప్పారా? అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ, ఏమీ అవసరం లేదని అన్నారు.

బాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జేసీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share