విక‌టించిన చంద్ర‌బాబు ఆక‌ర్ష్‌… ఈయ‌న అటు….ఆయ‌న ఇటు

March 19, 2018 at 7:13 pm
jyothula chantibabu,jaggam peta, YSRCP, Entry, chandra babu,

ఏపీలో ప్ర‌జా తీర్పును అప‌హ‌స్యం చేస్తూ సీఎం చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వంతో పాటు పార్టీ బ‌లోపేతానికి విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించేసుకున్నారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు విప‌క్షంలో అసంతృప్తిగా ఉంటే పార్టీ మార‌డం కామ‌న్‌. కానీ చంద్ర‌బాబు వైసీపీని నిర్వీర్యం చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుని ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఇద్ద‌రు ఎంపీల‌ను కూడా సైకిల్ ఎక్కించేసుకున్నారు.

 

అయితే ఇప్పుడు ఆ 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు ఊరుకోవ‌డం లేదు. వాళ్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే త‌మ దారి తాము చూసుకుంటామ‌ని బాబుకు బెదిరింపులు, వార్నింగ్‌లు ఇస్తున్నారు. అద్దంకి, జ‌మ్మ‌ల‌మ‌డుగు, బొబ్బిలి, జ‌గ్గంపేట ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో బాబు ఆప‌రేష‌న్ విక‌టిస్తోంది.

 

వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి మీద పోటీ చేసి ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. టీడీపీలో ఉంటే టిక్కెట్ రాదు.. అక్క‌డ ఫ్యూచ‌ర్ లేదు. దీంతో వాళ్లంతా ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ చెంత‌కు చేరిపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు సోమవారం  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

 

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంటిబాబు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి జ‌గ్గంపేట‌లో పోటీ చేసి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓడిపోయారు. అయితే అప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని బ‌లోపేతం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నెహ్రూకు చంద్ర‌బాబుకు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. నెహ్రూ త‌న‌యుడికి ఏకంగా జ‌డ్పీ చైర్మ‌న్ కూడా ఇచ్చారు.

 

చంటిబాబును చంద్ర‌బాబు అస‌లు లెక్క‌లోకే తీసుకోవ‌డం లేదు. ఆయ‌న‌కు నామ్‌కే వాస్తేగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఇక చంటిబాబు పార్టీతో పాటు ఏలేరు ప్రాజెక్టు క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి ఆయన రాజీనామా చేశారు. ఇక పార్టీలో చంటిబాబుకు ఫ్యూచ‌ర్ కూడా క‌న‌ప‌డ‌డం లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు వైఖ‌రితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయ‌న చివ‌ర‌కు పార్టీని వీడి జ‌గ‌న్ పార్టీ చెంత‌కు చేరారు.

 

విక‌టించిన చంద్ర‌బాబు ఆక‌ర్ష్‌… ఈయ‌న అటు….ఆయ‌న ఇటు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share