కావ‌లి వైసీపీలో సంచ‌ల‌నం…ఇక తిరుగులేన‌ట్టే

July 11, 2018 at 9:56 am
Kaavali YSRCP, Katamreddy vishnuvardhan reddy, venugopal reddy, together

నెల్లూరు జిల్లా కావ‌లిలో వైసీపీ రాజ‌కీయాలు బ‌లోపేత‌మ‌య్యాయా? ఇక్క‌డ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారు చేతులు క‌లిపారా? రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌రింత గ‌ట్టిప‌ట్టు సంపాయించుకునేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే సంకేతాల‌నే పంపుతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న సీనియ‌ర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల రెడ్డిలు ఒకటయ్యారు. విష్ణు వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినప్పటి నుంచి విష్ణు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
15-1508059963-katamreddyvishnuvardhanreddy-651-copy

అయితే, తాజాగా ఆయ‌న తిరిగి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చేరువ‌య్యారు. అదికూడా దివంగ‌త వైఎస్ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఇక్క‌డ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న ప్ర‌ముఖంగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, విష్ణు, వంటేరులు కలిసి కావ లిలో జయంతి వేడుకలను బారీగా నిర్వహించారు. ఇక్క‌డ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి న‌గ‌రంలో లేరు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న లేని లోటు తెలియ‌కుండా ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి అల్లూరు, బోగోలు, దగదర్తి, కావలి మండలాల నేతలతో కలిసి భారీ మోటా ర్‌సైకిల్‌ ర్యాలీగా పట్టణ ట్రంకురోడ్డు నుంచి ఉదయగిరి రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు వెళ్లారు.

మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు జలదంకి మండలం నుంచి ర్యాలీగా ఉదయగిరి రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు వచ్చారు. ఇద్దరు నేతల ఆధ్వర్యంలో అక్కడ రక్తదానం. అన్నదానం కార్యక్రమాలతో జయంతి నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌రెడ్డి అనుచరులు కూడా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వైఎస్‌ ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి ర్యాలీ గా ట్రంకురోడ్డులో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు వచ్చి మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాల యం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు గ్రూపులు వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలనే నిర్వహించి తామంతా వైఎస్ ఫ్యామిలీలో కుటుంబ స‌భ్యుల‌మే అని నిరూపించారు.

41397026296_625x300

ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నించిన ప్ర‌త్య‌ర్థిపార్టీ టీడీపీలో నేత‌లకు చెమ‌ట‌లు ప‌ట్టాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో నెల‌కొన్న వ‌ర్గ విభేదాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని త‌మ్ముళ్లు నిర్ణ‌యించుకున్నారు. అయితే, తాజా ప‌రిణామాల‌తో వారికి నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఇక‌, వైసీపీ అధినాయ‌క‌త్వం ఈ తాజా ప‌రిణామంపై హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అంద‌రూ క‌లిసి మెలిసి పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌ని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా ఓ వాట్సాప్ సందేశం పంపారు. మొత్తానికి వైసీపీ పుంజుకుంటోంద‌ని చెప్ప‌డానికి ఇది ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

కావ‌లి వైసీపీలో సంచ‌ల‌నం…ఇక తిరుగులేన‌ట్టే
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share