వైసీపీలోకి కొణ‌తాల రామ‌కృష్ణ‌..!

March 15, 2019 at 12:17 pm

వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న త‌రుణంలో ఇత‌ర పార్టీల నేత‌లంద‌రూ క్యూ క‌డుతున్నారు. తాజాగా.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నేత‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్లీ వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తోంది. నిజానికి. కొంతకాలంగా ఆయన టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇటీవ‌లే ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయ‌న క‌ల‌వ‌డంతో దాదాపుగా టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే.. కానీ.. ఊహించ‌ని రీతిలో ఆయ‌న మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరాల‌న్న ఆలోచ‌నకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ఇక్క‌డ చంద్ర‌బాబు ఇచ్చిన ట్విస్ట్‌తో కొణతాల రామ‌కృష్ణ వెన‌క్కిత‌గ్గిన‌ట్లు స‌మాచారం. నిజానికి.. ఆయ‌న‌ అనకాపల్లి ఎంపీ స్థానం కోసం ఆయన ప్రయత్నించార‌ని… ఈ సీటును విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు అడారి ఆనంద్‌ పేరును చంద్ర‌బాబు ఖాయం చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డంతో కొణ‌తాల సైలెంట్‌గా వెన‌క్కివ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌న్నీ కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయ‌ని.. అందుకే మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్ల‌డం వ‌ల్లే త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌న్న యోచ‌న‌లో కొణ‌తాల ఉన్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఈ మేర‌కు గురువారం అనకాపల్లిలో తన అనుచరులతో కొణ‌తాల స‌మావేశం నిర్వ‌హించారు. క్యాడ‌ర్ అభిప్రాయం మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటాన‌ని కొణ‌తాల చెబుతున్నా.. ఆయ‌న వైసీపీవైపే మొగ్గుచూపుతున్నార‌నే టాక్ అనుచ‌రుల్లో వినిపిస్తోంది. నిజానికి.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కొణతాల వైసీపీలోనే ఉన్నారు. అయితే.. విశాఖ ఎంపీ స్థానం, అనకాప‌ల్లి ఎంపీ స్థానంలో వైసీపీ ఓట‌మికి.. ఆయ‌న ప‌నితీరే కార‌ణ‌మంటూ.. పార్టీ అధినాయ‌క‌త్వం ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. ఇక అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న కొణ‌తాల రామ‌కృష్ణ మ‌ళ్లీ వైసీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ నుంచి కూడా సానుకూల స్పంద‌న రావ‌డంతో ఇవ్వాలో రేపో ఆయ‌న చేరిక ఖాయమ‌నే టాక్ వినిపిస్తోంది.

వైసీపీలోకి కొణ‌తాల రామ‌కృష్ణ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share