క‌న్నా ఎఫెక్ట్…అజ్ఞాతవాసంలో సోము వీర్రాజు..!

May 14, 2018 at 11:40 am
Kanna lakshmi Narayna, BJP, AP, somu veerraju, hide

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంపై పార్టీలో దుమారం రేగుతోంది. ఇన్ని రోజులూ అధ్య‌క్ష ప‌ద‌వి త‌న‌కు వ‌స్తుంద‌ని ధీమాతో ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పార్టీ అధిష్టానం దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. చంద్ర‌బాబును ఎంత విమ‌ర్శిస్తే పార్టీ అధిష్టానానికి అంత ద‌గ్గ‌ర‌వుతాన‌ని భావించిన సోముకు తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే  క‌న్నా పేరు ప్ర‌క‌టించ‌గానే.. పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న ఆ త‌ర్వాత అజ్ఞాత‌వాసిగా మారిపోయారు. 

 

ప్ర‌స్తుతం ఎవ‌రికీ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న ఏం నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని పార్టీవ‌ర్గాలు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో టీడీపీ, వైసీపీ, ఇత‌ర పార్టీల నేత‌లు ఈ ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. కొండ నాలిక‌కు మందు వేస్తే.. ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా త‌యారైంది బీజేపీ ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కడంతో సోము వీర్రాజు తీవ్ర అసంత‌`ప్తితో ర‌గిలిపోతున్న‌ట్లు తెలుస్తోంది. మొన్న‌టికిమొన్న ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుదామ‌ని చూసిన వారికే ప‌దువులు ఇచ్చి, మొద‌టి నుంచి ప‌నిచేస్తున్న‌వారిని ప‌క్క‌న‌బెట్ట‌డంపై సోమువీర్రాజు వర్గం మండిప‌డుతోంది. 

 

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది. తమ నేత సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కొందరు సభ్యులు ప్రకటించారు. నిజానికి మొదటి నుంచి పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని  వస్తున్న సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవి త‌న‌కే వ‌స్తుంద‌న్న ధీమాతో ఇన్నిరోజులూ ఉన్నారు. 

 

మొదట నుంచీ పార్టీలో ఉన్న తనను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన మాజీమంత్రి కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు పదవి ఇవ్వ‌డాన్ని సోము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయన వర్గీయులు కూడా పార్టీ అధిష్టానంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభమైన రాజీనామాల ప‌ర్వం ఎక్క‌డిదాకా కొన‌సాగుతుందో చూడాలి మ‌రి. ఏదేమైనా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యంకాద‌ని చెప్పిన త‌ర్వాత ఏపీలో బీజేపీ నేత‌లు ఇర‌కాటంలో ప‌డిపోయారు. తాజాగా.. అధ్య‌క్షుడి నియామ‌క వివాదంతో పార్టీ ప‌రిస్థితి మ‌రింత గంద‌గోళంగా మారుతోంది.

 

క‌న్నా ఎఫెక్ట్…అజ్ఞాతవాసంలో సోము వీర్రాజు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share