తండ్రి టీడీపీలో…. కొడుకు వైసీపీలో…!

November 7, 2018 at 11:56 am

రాజ‌కీయాల్లో ఎత్తుల‌కు పైఎత్తులు స‌హ‌జం. తాడి త‌న్నేవాడు ఒక‌డుంటే.. వాడి త‌ల‌త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటార‌ని అం టారు. అయితే, ఇలాంటి ఎత్తులు అన్ని వేళ‌లా స‌క్సెస్ అవుతాయా? అంటే చెప్ప‌లేం. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. ప్ర‌కా శం జిల్లా రాజ‌కీయాల‌లో ఎద‌గాల‌ని, ఇక్క‌డ బ‌లంగా ఉన్న వైసీపీ కేడ‌ర్‌ను దెబ్బ‌కొట్టాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా ఇక్క‌డ కు ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. అయి తే.. కొంద‌రు నాయ‌కులు ఇక్క‌డ బాగానే ప‌నిచేస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ పంథాల‌ను వీడ‌డం లేదు. త‌మ‌దే పైచేయి అని భావిస్తున్నారు. ఇలాంటి వారిలో సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నాయ‌కుడు, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ మూర్తి ఒక‌రు.

hqdefault

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు గెలిచిన ఆయ‌న త‌న ఆధిప‌త్యాన్ని సాధించారు. త‌న‌దే పైచేయిగా చెబుతు న్నారు. త‌రాలు మారుతున్నా త‌న ఆధిప‌త్య ధోర‌ణిని మార్చుకోవ‌డం లేదు. పైగా వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి ర‌వి టీడీపీలోకి రావ‌డాన్ని మ‌రింత‌గా ఆయ‌న జీర్ణించుకోలేక పోతున్నారు. ప్ర‌త్య‌ర్థి నాయ‌కులు టీడీపీలోకి రావ‌డంతో త‌న హ‌వాకు ఎక్క‌డ అడ్డుక‌ట్ట ప‌డుతుందోన‌ని ఆయ‌న బెంబేలెత్తుతున్నారు. దీంతో మ‌రింత‌గా క‌ర‌ణం రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆయ‌న త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. క‌ట్ చేస్తే.. మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడిని రాజ‌కీయ అరంగేట్రం చేయించిన క‌ర‌ణం.. ఆ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని గెలిపించుకోలేక చ‌తికిల‌ప‌డ్డారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌న కుమారుడిని గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు న్న వాతావ‌ర‌ణంలో అద్దంకిటికెట్‌ను తిరిగి గొట్టిపాటి ర‌వికే కేటాయించాల‌నిచంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నా రు. ఇది మ‌రింత‌గా క‌ర‌ణాన్ని ఇబ్బంది పెడుతోంది. దీంతో క‌ర‌ణం వ్యూహానికి తెర‌దీశారు. త‌న కుమారుడిని వైసీపీలోకి ఎంట్రీ ఇప్పించ‌డం ద్వారా వైసీపీలో ఖాళీగా ఉన్న అద్దంకి టికెట్‌ను త‌న కుమారుడికి ఇప్పించుకునేలా చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, తాను మాత్రంటీడీపీలోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మొత్తం కుటుంబం అంతా కూడా వైసీపీలోకి జంప్ చేస్తే..త‌న‌పై ఉన్న ఫ్యాక్ష‌న్ కేసులు తిర‌గదోడే ప్ర‌మాదాన్ని గుర్తించిన క‌ర‌ణం.. అలా కాకుండా కేవ‌లం త‌న కుమారుడిని మాత్రమే వైసీపీలోకి పంపాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే దీనికి సంబంధించిన క్ర‌తువు పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. నిజానికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. క‌ర‌ణం బ‌ల‌రాంను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ, ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్నారు. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం, త‌న కుమారుడికి టీడీపీ టికెట్‌ల‌భించేలా లేక‌పోవ‌డంతో తాజాగా తీసుకున్న నిర్ణ‌యం జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ప‌రిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

తండ్రి టీడీపీలో…. కొడుకు వైసీపీలో…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share