కర్ణాటక సీఎం య‌డ్యూర‌ప్ప రికార్డు..!

May 18, 2018 at 3:00 pm
Karnataka CM, BJP, yeddyurappa, Supreme court, Statement

క‌ర్ణాట‌క 23వ‌  ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప మూడురోజుల ముఖ్య‌మంత్రిగా మిగిలిపోనున్నారా..?  అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయ‌న అన్నిదారులూ మూసుకుపోయాయా..?  కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు కావాల్సినంత స‌మ‌యం లేక‌పోవ‌డంతో తానే రాజీనామా చేస్తారా..?  లేక బ‌ల‌ప‌రీక్షకు నెగ్గ‌లేక బీజేపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలుతుందా..? ఇలా క‌న్న‌డ వ్య‌వ‌హారంపై అనేక‌క‌నేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. 

 

అయితే బ‌ల‌ప‌రీక్ష‌కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో మాత్రం యెడ్డీ బ‌ల‌ప‌రీక్ష నెగ్గ‌డం మాత్రం క‌ష్ట‌మేన‌నే వాద‌న వినిపిస్తోంది. 1983లో యెడ్డీ తొలిసారిగా శిక‌రిపుర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2008లో తొలిసారిగా ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. బ‌ల‌నిరూప‌ణ విష‌యంలో స్పీక‌ర్ పాత్ర కూడా కీల‌కంగా మార‌నుంది. అయితే సుప్రీం కోర్టు తీర్పుకు ముందు య‌డ్యూర‌ప్ప బీజేపీ ఎమ్మెల్యేనే స్పీక‌ర్ ఎన్నుకుని ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌జాస్వామిక సంప్ర‌దాయాన్ని కూడా ప‌క్క‌కు పెడుతార‌నే టాక్ వినిపించింది. కానీ, సుప్రీం కోర్టు ఈ విష‌యంలో స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డంతో యెడ్డీకి ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది. 

 

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే (71)  ప్రొటెం స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో య‌డ్యూర‌ప్ప బ‌ల‌ప‌రీక్ష నెగ్గ‌డం అంత సులువుకాద‌నీ ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే… సుప్రీం కోర్టులో బీజేపీ తరఫు న్యాయవాది చేసిన ఏ వాదనతోనూ ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకీభవించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీల‌క తీర్పును వెలువ‌రించింది. 

 

శ‌నివారం సాయంత్రం నాలుగుగంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని, య‌డ్యూర‌ప్ప ఎలాంటి విధాన ప‌ర‌మైనా చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశించింది. అంతేగాకుండా ప్రొటెం స్పీక‌ర్ ఆధ్వ‌ర్యంలోనే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని, ఆంగ్లో ఇండియ‌న్ ఎమ్మెల్యే ఎన్నిక చేప‌ట్ట‌వ‌ద్దంటూ కోర్టు ఆదేశించింది.  అయితే బ‌ల‌ప‌రీక్ష‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా  ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌కు ప‌దిహేను రోజుల గ‌డువు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా..సుప్రీం కోర్టు  ఆదేశాల‌ను పాటిస్తాన‌నీ, సీఎస్‌తో మాట్లాడి రేపు అసెంబ్లీ స‌మావేశ‌ప‌ర్చుతాన‌ని య‌డ్యూర‌ప్ప మీడియా స‌మావేశంలో పేర్కొన్నారు.

 

కర్ణాటక సీఎం య‌డ్యూర‌ప్ప రికార్డు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share