కర్ణాటక సీఎం ఏడ్డ్యూరప్పకు సుప్రీమ్ కోర్ట్ నుంచి ఊహించని దెబ్బ

May 18, 2018 at 1:45 pm
Karnataka, CM, yeddyurappa, supreme Court, Congress party, BJP

కేంద్రం అండ‌దండ‌ల‌తో.. గ‌వ‌ర్న‌ర్ స‌హ‌కారంతో దూకుడు పెంచిన బీజేపీ నేత‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌ను ఎట్ట‌కేల‌కు సుప్రీం కోర్టు క‌ట్టిప‌డేసింది. బ‌ల‌ప‌రీక్ష‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ప‌దిహేను రోజుల్లో ఎలాగైనా కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకుని ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవాల‌ని చూసిన యెడ్డీకి గ‌ట్టి ఎదుర‌దెబ్బ త‌గిలింది. శ‌నివారమే అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆయ‌న ప‌డిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. కోర్టు తీర్పు నేప‌థ్యంలో తన ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గుతుంద‌ని పైకి య‌డ్యూర‌ప్ప చెబుతున్నా… లోలోప‌ల మాత్రం ఆయ‌న‌ను భ‌యం వెంటాడుతోందనే టాక్ వినిపిస్తోంది. 

 

 ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం లేకుండానే ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీల‌క తీర్పును వెలువ‌రించింది. శ‌నివారం సాయంత్రం నాలుగుగంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. అంతేగాకుండా.. య‌డ్యూర‌ప్ప ఎలాంటి విధాన ప‌ర‌మైనా చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యేల భ‌ద్ర‌త‌కు సంబంధించి డీజీపీని ఆదేశించింది. 

 

అంతేగాకుండా ప్రొటెం స్పీక‌ర్ ఆధ్వ‌ర్యంలోనే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని, ఆంగ్లో ఇండియ‌న్ ఎమ్మెల్యే ఎన్నిక చేప‌ట్ట‌వ‌ద్దంటూ కోర్టు ఆదేశించింది.  బ‌ల‌ప‌రీక్ష‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా  ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌కు ప‌దిహేను రోజుల గ‌డువు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌, జేడీఎస్ నేత‌లు స్వాగ‌తించారు. బ‌ల‌ప‌రీక్ష‌కు తాము సిద్ధంగా ప్ర‌క‌టించారు. 

 

సుప్రీం కోర్టులో  కాంగ్రెస్‌-జేడీఎస్ త‌రుపున అభిషేక్ సింఘ్వి, క‌పిల్‌సిబ‌ల్‌, చిదంబ‌రం వాద‌న‌లు వినిపించారు. కేంద్రం త‌రుపున ఏజీ వేణుగోపాల్‌, య‌డ్యూర‌ప్ప త‌రుపున మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహిత్గీ వాద‌న‌లు వినిపించారు. 

 

అయితే బీజేపీ బ‌ల‌నిరూప‌ణ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని రోహిత్గీ చేసిన అభ్య‌ర్థ‌న‌ను  సుప్రీం కోర్టు నిరాక‌రించింది. అంతేగాకుండా.. సీక్రెట్ బ్యాల‌ట్ ప‌ద్ధ‌తిలో ఓటింగ్‌ నిర్వ‌హించాల‌ని రోహిత్గీ కోర‌గా దానిని కూడా కోర్టు తిర‌స్క‌రించింది. స‌రైన బ‌లం లేకున్నాముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ యెడ్డీని సుప్రీం కోర్టు అన్నివైపులా క‌ట్ట‌డి చేసింద‌నే టాక్ వినిపిస్తోంది. 

 

ఈ నేప‌థ్యంలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డం యెడ్డీకి అంత సులువుకాద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.  ఇదిలా ఉండ‌గా.. సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌, జేడీఎస్ నేత‌లు స్వాగ‌తించారు. ఇక ఇటు కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌లో ఉంచారు. ఈ నేప‌థ్యంలో ఏడ్డ్యూరప్ప బ‌ల‌ప‌రీక్ష‌లో ఎలా నెగ్గుతారా ? అన్న‌ది స‌స్పెన్స్‌గానే ఉంది. 

 

కర్ణాటక సీఎం ఏడ్డ్యూరప్పకు సుప్రీమ్ కోర్ట్ నుంచి ఊహించని దెబ్బ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share