రిసార్ట్ రాజకీయంపై సుప్రీమ్ కోర్ట్ అదిరిపోయే జోక్

May 18, 2018 at 3:15 pm
Karnataka Elections, Resort, congress MLA, Supreme Court, Joke

అయ్య‌య్యో… బీజేపీకి షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి.. క‌ర్ణాక‌ట‌లో ఎలాగైన ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్న ఆ పార్టీకి అన్నీ అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. దొడ్డిదారిన అధికారం చేజ‌క్కించుకున్న క‌మ‌ల‌ద‌ళానికి అడుగ‌డుగునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఈక్ర‌మంలోనే..  ఆఖ‌రికి సుప్రీం కోర్టు కూడా ఓ జోక్ వేసి బీజేపీకి షాక్ ఇచ్చింది. కుంటిసాకులు చెబుతూ బ‌ల‌ప‌రీక్ష‌కు స‌మ‌యం కావాల‌ని కోరిన ఆ పార్టీ త‌రుపున వాద‌న‌లు వినిపిస్తున్న ముకుల్ రోహిత్గీకు చ‌మ‌త్కారంతో స‌మాధానం చెప్పింది. దీంతో ఒక్క‌సారిగా కోర్టు హాలులో న‌వ్వులు పూసాయి. ఇంత‌కీ ఏమిటా జోక్ అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ క‌థ‌నం చ‌దవాల్సిందే..

 

స‌రైన బ‌లం లేకున్నా ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాయి. కాంగ్రెస్-జేడీఎస్ త‌రుపున అభిషేక్ సింఘ్వి, క‌పిల్‌సిబ‌ల్‌, చిదంబ‌రం సుప్రీం కోర్టులో వాద‌న‌లు వినిపించారు. కేంద్రం త‌రుపున ఏజీ వేణుగోపాల్‌, య‌డ్యూర‌ప్ప త‌రుపున మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహిత్గీ వాద‌న‌లు వినిపించారు. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న త‌ర్వాత సుప్రీం కోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. శ‌నివారం సాయంత్రం నాలుగుగంట‌ల‌కు అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. అయితే బీజేపీ బ‌ల‌నిరూప‌ణ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని ముకుల్ రోహిత్గీ కోర‌గా సుప్రీం కోర్టు అందుకు నిరాక‌రించింది. 

 

ఈ స‌మ‌యంలోనే దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న క్యాంపు రాజ‌కీయాల‌పై సుప్రీంకోర్టు వేసిన‌ ఓ జోక్ కోర్టు హాలులో న‌వ్వులు పూయించింది. యెడ్డీ త‌రుపన వాద‌న‌లు వినిపిస్తున్న‌ ముకుల్ రోహత్గీ… బల పరీక్షకు మరికొంత సమయం కావాలని కోరారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వెలుపల నిర్బంధంలో ఉన్నారనీ.. వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున కనీసం సోమవారం వరకు సమయం ఇవ్వాలని అభ్య‌ర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు బస చేస్తున్న రిసార్టుల యజమానులు కూడా తమను లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నార‌నీ రిసార్టు రాజ‌కీయాల‌పై ఛలోక్తి విసిరింది. దీంతో అక్క‌డ బీజేపీ త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తోన్న వారికి పెద్ద షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.

 

రిసార్ట్ రాజకీయంపై సుప్రీమ్ కోర్ట్ అదిరిపోయే జోక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share