సిద్ధు టీంకు టెన్షన్ ..టెన్షన్…ఒకపక్క గవర్నర్ మరోపక్క రిసార్ట్ రాజకీయం

May 15, 2018 at 7:36 pm
Karnataka elections result, governer, sidharamayya, MLA, resorts

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ఎలాగైనా సరే మళ్లీ కన్నడ నాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇంకా చెప్పాలంటే తాను అధికారం చేప‌ట్ట‌క‌పోయినా బీజేపీ మాత్రం క‌న్న‌డ‌లో అధికారం చేప‌ట్ట‌కూడ‌ద‌న్న టార్గెట్‌తోనే పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కంటే చాలా త‌క్కువ సీట్లు వ‌చ్చినా జేడీఎస్ అధినేత కుమార‌స్వామిని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. త‌మ పార్టీ సంపూర్ణ‌మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించి పెద్ద సంచ‌ల‌నానికి తెర‌దీసింది. 

 

జేడీఎస్‌కు కాంగ్రెస్‌ ఇప్పటికే బంపరాఫర్ కూడా ఇవ్వడంతో బీజేపీకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ అప్రమత్తమైంది. జేడీఎస్‌ను చీల్చే ప్ర‌య‌త్నాలు చేయ‌డం, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు వ‌ల‌వేసే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక గ‌వ‌ర్న‌ర్ వాజుభాయ్ వాలా గుజ‌రాతీ కావ‌డం, అంత‌కుమించి మోడీ వీర విధేయుడు కావ‌డంతో పాటు ఆయ‌న కోసం గ‌తంలో త‌న సీటు త్యాగం చేసిన వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న అక్క‌డ ఏదోలా బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ప‌ని చేస్తున్నార‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది. 

 

వాజుభాయ్ వాలా ఎలాగూ కేంద్రం ఇంకా చెప్పాలంటే మోడీ చెప్పు చేత‌ల్లోనే ఉంటాడు. జేడీఎస్ + కాంగ్రెస్ క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి కోరి… ఆయ‌న వీరిని ఆహ్వానించకపోతే న్యాయపోరాటానికి కాంగ్రెస్, జేడీఎస్ దిగే అవకాశముంది. అవసరం అనుకుంటే… రాష్ట్రపతి ముందు పరేడ్‌కు కూడా సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌కు గ‌వ‌ర్న‌ర్‌తో ఓ టెన్ష‌న్ అనుకుంటే ఇటు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం కూడా మ‌రో టెన్ష‌న్ అయ్యింది.

 

అంతేకాదు బీజేపీ ఆకర్ష్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. వీరిని కాపాడుకునేందుకు చాలా ప్లాన్లు వేస్తోంది. ప్ర‌త్యేక విమానాల్లో కొంద‌రిని కాంగ్రెస్ పాలిత ప్రాంత‌మైన పంజాబ్‌కు త‌ర‌లిస్తుంటే మ‌రికొంద‌రిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రిసార్ట్‌ల‌కు త‌ర‌లిస్తోంది. ఇక ఇన్ని సందేహాలు, స‌స్పెన్స్‌ల మ‌ధ్య క‌న్న‌డ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందో ?  చూడాలి. ఈ రోజు వెలువ‌డిన‌ ఫలితాల్లో బీజేపీ -104, కాంగ్రెస్-78, జేడీఎస్-38 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏ పార్టీ అయితే మేజిక్ ఫిగర్ 112 స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుంది.

 

సిద్ధు టీంకు టెన్షన్ ..టెన్షన్…ఒకపక్క గవర్నర్ మరోపక్క రిసార్ట్ రాజకీయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share