క‌ర్ణాటక రిజల్ట్‌.. ఓట్లు కాంగ్రెస్‌కు.. సీట్లు బీజేపీకి..!

May 15, 2018 at 2:43 pm
karnataka, elections result, voting, BJP, congress, seats

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోఆస‌క్తిక‌ర ప‌రిణామం ఎదురైంది. ఇక్క‌డ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అదేస‌మ‌యంలో వ‌స్తుందో రాదో అనుకున్న బీజేపీ మాత్రం రికార్డు సృష్టించింది. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల క‌న్నా క‌నీసం 50 నుంచి 60 స్థానాల్లో ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించి విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. కాంగ్రెస్ స్థానాల్లోనూ బీజేపీ పాగా వేసింది. అదేస‌మ‌యంలో మైనార్టీ అభ్య‌ర్థుల‌కు సీట్లు ఇవ్వ‌కున్నా కూడా వారి ఓట్లు సైతం బీజేపీ కైవ‌సం చేసుకుంది అయితే, ఇక్క‌డే బీజేపీకి సీట్లు ఎక్కువ‌గా వ‌చ్చి ఆధిక్యంలో నిల‌బ‌డింది. కాగా, తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌ని భావించిన కాంగ్రెస్‌కు చావు దెబ్బ‌త‌గిలింది. అధికారం అంచుల‌కు కాదుక‌దా.. అన్న‌ట్టుగా అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిపోయింది.

 

 అధినాయ‌కులుగా పేర్కొనే చాలా మంది ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ప్ర‌ధాన పార్టీ ల నుంచి బ‌రిలోకి దిగిన చాలా మందిలో త‌మ త‌మ భ‌విత‌వ్యం తేలిపోయాక తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక‌, ఇదే స‌య‌మంలో తాజాగా వ‌స్తున్న గ‌ణాంకాల ప్ర‌కారం బీజేపీ 110 సీట్ల‌ను కైవ‌సం చేసుకుని మేజిక్ ఫిగ‌ర్ ఒక‌టి రెండు సీట్ల తేడాతో ఆగిపోతుంద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ మాత్రం క‌నీసం 70  స్థానాల్లో కూడా విజ‌యం సాధించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.  ఇక‌, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ మాత్రం అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. 42 స్థానాల‌కు పైగా త‌న ఖాతాలో వేసుకునేం దుకు ఉరుకులు ప‌రుగులు పెడుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న నాయ‌కులు బీజేపీదే విజ‌య‌మ‌ని ఘంటా ప‌థంగా చెబుతున్నారు. 

 

ఇక‌, ఈ క్ర‌మంలోనే మ‌రో విశ్లేష‌ణ కూడా సాగుతోంది. అధికారం కోల్పోయి, ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసిన కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ఉంద‌ని అంటున్నారు.అంటే ఓటింగ్ శాతంలో చూసిన‌ప్పుడు మాత్రం కాంగ్రెస్ ముందు వ‌రుస‌లో నిలిచింద‌ని, బీజేపీ పూర్తిగా వెనుబ‌డి పోయింద‌ని చెబుతున్నారు. అంటే.. ఓటింగ్ శాతంలో  కాంగ్రెస్‌కు 38.01%, బీజేపీకి 36.07% ఓట్లు ల‌భించాయ‌ట‌. అంటే బీజేపీ గెలిచిన స్థానాల్లో అభ్యర్థులు కేవ‌లం రెండు నుంచి మూడు నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఉంటే.. కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలిచిన స్థానాల్లో మాత్రం 20 వేల నుంచి 30 వేల తేడాతో అభ్య‌ర్థులు త‌మ స‌త్తా చాటుకున్నార‌ని తాజా స‌మాచారం. సో.. దీంతో ఓట్లు కాంగ్రెస్‌కు.. సీట్లు బీజేపీకి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదీ కన్న‌డ నాట విచిత్ర ఓటింగ్‌! 

 

క‌ర్ణాటక రిజల్ట్‌.. ఓట్లు కాంగ్రెస్‌కు.. సీట్లు బీజేపీకి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share