సంచ‌ల‌నం: ఎన్టీఆర్ షో కోసం క‌త్తికి ఆ వైసీపీ లీడ‌ర్ రిక‌మెండ్‌..

January 8, 2018 at 3:36 pm

క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ వివాదం టాలీవుడ్‌లో రోజు రోజుకు చినికి చినికి గాలి వాన‌లా మారుతోంది. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే ప‌లువురు రంగంలోకి దిగి క‌త్తికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. హైప‌ర్ ఆది, పూన‌మ్ కౌర్‌, వేణు మాధ‌వ్‌, కోన వెంక‌ట్, బ‌న్నీ వాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా క‌త్తిని టార్గెట్‌గా చేసుకుని ప‌లువురు ఏకేస్తున్నారు. తాజాగా నిన్న పూన‌మ్ కౌర్ ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ క‌త్తి మ‌హేష్ ఆమెకు ఆరు ప్ర‌శ్న‌లతో కూడిన కౌంట‌ర్ ఎటాక్ వేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా హైప‌ర్ ఆది క‌త్తికి ఇప్పుడు ఏడు ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు. మ‌ధ్య‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు వైసీపీని, వైసీపీ నేత అంబ‌టి రాంబాబును కూడా లాగాడు. ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో క‌త్తి మ‌హేష్ ఎంట్రీకి అంబటి రాంబాబు ఎందుకు రికమెండ్ చేశారో చెప్పాలని హైపర్ ఆది ఆసక్తికర ప్రశ్న సందించారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసేందుకు క‌త్తికి వైసీపీ ఎంత ఇచ్చిందో చెప్పాల‌న్న ప్ర‌శ్న కూడా వేశాడు.

ఇక హైప‌ర్ ఆది వేసిన ప్ర‌శ్న‌ల‌ను చూస్తుంటే వైసీపీయే క‌త్తి మ‌హేష్ వెన‌క ఉంద‌ని వారు ఆనుమానిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. 2019లో పవన్ తమకు పోటీగా వస్తారని భావించే ఇప్పుడు ఆయనను తెరపైకి తెచ్చి ఉంటారనే అనుమానాలు ప‌వ‌న్ అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్లాన్ ప్ర‌కార‌మే ప‌వ‌న్‌పై దాడి జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ అభిమానులు చెపుతున్నారు. ఇక హైప‌ర్ ఆది క‌త్తి మ‌హేష్‌కు వేసిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి. 

 

క‌త్తి మ‌హేష్‌కు హైప‌ర్ ఆది వేసిన‌ ఆ ఏడు ప్ర‌శ్న‌లు ఇవే..

 

1) నీ తండ్రి వ్య‌వసాయాధికారిగా ఎన్ని కోట్ల రూపాయ‌లు లంచాలుగా మింగాడు?

 

2) నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు? 

 

3)బిగ్‌బాస్ షోలో ఎంట్రీ కోసం నిన్ను అంబ‌టి రాంబాబు ఎందుకు రిక‌మెండ్ చేశారు?

 

4)నువ్వు ప‌వ‌న్‌ను టార్గెట్ చేసినందుకు వైసీపీ ఎంత ముట్ట‌చెప్పింది?

 

5)వాయ‌ల్పాడు రైతుల‌ను చిట్టీల పేరుతో నీ త‌ల్లి ఎందుకు మోసం చేసింది?

 

6)నీ సోద‌రి భ‌ర్త‌ను బెదిరించి డ‌బ్బులు గుంజ‌డానికి ఎవ‌రు స‌హాయం చేశారు?

 

7)నీ కుటుంబం ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే సంక్రాంతికి గ్రామానికి ఎందుకు రాదు?

 

సంచ‌ల‌నం: ఎన్టీఆర్ షో కోసం క‌త్తికి ఆ వైసీపీ లీడ‌ర్ రిక‌మెండ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share