క‌ర్ణాట‌క‌లో కేసీఆర్ గెలిచాడు… బాబు ఓడాడు

May 15, 2018 at 3:49 pm
KCR, chandra babu, Karnataka election campaign, JDS, BJP

40 ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ.. నేడు క‌న్నీరు మున్నీర‌వుతోంది!  మొహం చూపించ‌లేక‌.. ఆఫీస్‌కే ప‌రిమిత‌మైంది!! ఇన్నాళ్లుగా త‌న‌కు తిరుగులేద‌ని, త‌న‌ను ఎద‌రించేవారు లేర‌ని, అంద‌రూ తాను చెప్పిందే వింటార‌ని భావిస్తూ వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఊహించ‌ని విధంగా పెద్ద దెబ్బ ప‌డింది. ఆయ‌న మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. తాజాగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ ఫ‌లితాలు చూశాక‌.. చంద్ర‌బాబు కు బెం గ‌ళూరు బిస్‌బిళే బాత్ తిన్నంత ప‌నైంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేద‌ని పోరు సాగించిన చంద్ర‌బాబు బీజే పీతో అంట‌కాగి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన విష‌యాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. బీజేపీని ఓ శ‌త్రు పార్టీగా ఆయ‌న ప్ర‌చా రం చేయ‌డం ప్రారంభించారు. 

 

ఏపీలోనే కాదు, బీజేపీకి ప‌ట్టున్న రాష్ట్రాల్లోనూ ఆ పార్టీని బ‌ద్నాచేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆయ‌న క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న బీజేపీకి వ్య‌తిరేకంగా పావులు క‌దిపారు. బీజేపీకి ఓట్లు వేయొద్దంటూ.. అక్క‌డి తెలుగు వారికి ఆయ‌న పిలుపునిచ్చారు. అయినా కూడా బీజేపీ అధిష్టానం బాబును ఒక్క‌మాట కూడా అన‌లేదు. పూర్తి సంయ‌మ‌నం పాటించింది. అంతేకాదు, ఇప్ప‌టికైనా బాబు వ‌స్తే.. మాతో క‌లుపుకొనేందుకు మేం రెడీ అంటూ కొంద‌రు నాయ‌కులు సైతం ప్ర‌క‌టించారు. అయినాకూడా చంద్ర‌బాబు త‌న పంథాను మార్చుకోకుండా బీజేపీని తీవ్రంగా వ్య‌తిరేకించి త‌న అనుంగుల‌తో, చెంచాగాళ్ల‌తో అక్క‌డ ప్ర‌చారం చేయించారు. అయితే, తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆమాత్రం తెలివి ఉండ‌వా? అంతా బాబు చెప్పిన‌ట్టే న‌డుస్తుందా? 

 

ఖ‌చ్చితంగా తెలుగు ప్ర‌జ‌లు బాబు వ్య‌తిరేకించారు. బాబు మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. బెంగ‌ళూరు, బ‌ళ్లారి, మైసూరు త‌దిత‌ర ప్రాంతాల్లోని తెలుగు వారు బీజేపీకి అధిరిపోయే మెజారిటీని క‌ట్ట‌బెట్టారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌కు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని వ్య‌తిరేకించ‌మ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ, ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌ను మాత్రం బ‌ల‌ప‌ర‌చాల‌ని పిలుపునిచ్చారు. ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌నీయంగా ప‌రిగ‌ణించిన అక్క‌డి ప్ర‌జ‌లు జేడీఎస్‌కు మెజారిటీ స్థానాల్లో అవ‌కాశం క‌ల్పించారు. కేవ‌లం 30 తో ఆగిపోతుంద‌ని భావించి జేడీఎస్ మెజీరిటీ ఇప్పుడు 40లు దాటుతోంది. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న వారు చంద్ర‌బాబు వేస్ట్ నాయ‌కుడు అనే అంటున్నారు. మ‌రి రాబోయే 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ దెబ్బ‌కి బాబు ఏమ‌వుతారో చూడాలి. 

 

క‌ర్ణాట‌క‌లో కేసీఆర్ గెలిచాడు… బాబు ఓడాడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share