సీట్లు మార్చుకుంటున్న మామ‌, అల్లుడు..!

November 7, 2018 at 11:37 am

తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఇప్పుడు అంద‌రి ద‌`ష్టి ఆ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. అక్క‌డ ఈసారి అధికార పార్టీ నుంచి ఎవ‌రుపోటీ చేస్తారు..? అనేదానిపైనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏదని అనుకుంటున్నారా..? అది మ‌రేదో కాదు.. టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్‌. ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బిగ్‌ఫైట్ త‌ప్ప‌ద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 6న‌ అసెంబ్లీ ర‌ద్దు చేసి.. 105మంది అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించి విష‌యం తెలిసిందే. అందులో ఆయ‌న పేరు కూడా ఉంది.

KCR-Harish-Rao-2

కానీ.. ఈ రెండు నెల‌ల్లో ప‌రిణామాలు వేగంగా మారాయి. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్‌కు గ‌ట్టిపోటీ త‌ప్ప‌ద‌నే టాక్ మొద‌ట్లో వినిపించింది. తాజాగా.. ఆయ‌న ఇక్క‌డ ఓడిపోయినా ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. నిజానికి.. నిఘావ‌ర్గాలు చెబుతున్న మాట కూడా ఇదేన‌ని.. ప‌లు సంస్థ‌లు స‌ర్వేల్లోనూ ఇదే విష‌యం తేలిన‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా… స్థానిక ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆశించిన మేర‌కు అభివ‌`ద్ది జ‌ర‌గ‌లేద‌నే అసంత‌`ప్తితో ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు నిఘావ‌ర్గాలు చెప్పాయ‌ట‌. ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ నేత వంటేరు ప్ర‌తాప్‌రెడ్డిపై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరుగుతున్నట్లు స్వ‌యంగా గులాబీ వ‌ర్గాలు ఒప్పుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

సుమారు 70ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న త‌న ఫౌంహౌస్ కోస‌మే కొంత మేర‌కు అభివ‌`ద్ధి చేశార‌త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గానికి కేసీఆర్ ఒర‌గ‌బెట్టింది కూడా ఏమీ లేద‌ని ప్ర‌జ‌లు బ‌హిరంగంగానే అనుకుంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ఇత‌ర నియోజ‌వ‌క‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని, అదికూడా మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్దిపేట నుంచి బ‌రిలోకి దిగాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక గ‌జ్వేల్ నుంచి మంత్రి హరీశ్‌రావును బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో కేసీఆర్ ఆంత‌ర్యం ఏమిటో తెలియ‌దు కానీ.. ప‌రిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి.

kcr-harish-rao-pic-688-30-1461999326

తానే ఓడిపోయే ప‌రిస్థితి ఉన్న గ‌జ్వేల్‌లో హ‌రీశ్‌రావును బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌కు కేసీఆర్ రావ‌డంలో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీలో హ‌రీశ్‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని, మొత్తం కేటీఆర్ దే న‌డుస్తుంద‌ని పార్టీవ‌ర్గాలే గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రిగా గెల‌వ‌లేని స్థానం నుంచి మంత్రిగా హ‌రీశ్‌రావు గెలుస్తాడ‌ని కేసీఆర్ ఎలా అనుకుంటార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే.. దీనికి హ‌రీశ్ అనుచ‌రులు, అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

సీట్లు మార్చుకుంటున్న మామ‌, అల్లుడు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share