హ‌రీశ్‌ని త‌ప్పించేందుకు కేసీఆర్ భారీ స్కెచ్‌..?

November 8, 2018 at 5:19 pm

మంత్రి హ‌రీశ్‌ని త‌ప్పించేందుకు కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నారా..? ఇందుకు ఈ ఎన్నిక‌లే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్నారా..? అందుకవ‌స‌ర‌మైన మైండ్‌గేమ్‌ను ఏడాదికాలంగా అమ‌లు చేస్తున్నారా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి హ‌రీశ్‌రావు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ త‌ర్వాత పార్టీలో అంత‌టి ప‌ట్టున్న నేత ఆయ‌నే. ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు పొంది.. అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ పార్టీని గ‌ట్టెక్కించిన ఘ‌న‌త ఆయ‌నకు ఉంది. కానీ.. ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. పార్టీలో మొద‌లైన వార‌స‌త్వ పోరులో హ‌రీశ్ వెన‌క‌బ‌డిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడంతా కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ చెప్పిందే వేదం. ఆఖ‌రికి కేసీఆర్ సైతం కేటీఆర్ మాట వినాల్సిన అనివార్య ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

Harish_Rao_KCR_Facebook

అయితే.. ఈ రాజ‌కీయ వారస‌త్వ పోరులో కేసీఆర్ కేటీఆర్ వైపే మొగ్గుచూప‌డంతో ప‌రిస్థితులు మ‌రింత వేగంగా మారిపోయాయ‌నే టాక్ పార్టీవ‌ర్గాల్లో వినిపిస్తుంది. నిజానికి … 2014 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో మంత్రి హ‌రీశ్ క‌నుస‌న్న‌ల్లో స‌గానికి స‌గం ఎమ్మెల్యేలు ఉండేవార‌ట‌. స‌రిగ్గా ఇక్క‌డి నుంచే కేసీఆర్ మైండ్‌గేమ్ మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. హ‌రీశ్‌తో ట‌చ్‌లో ఉన్న ఎమ్మెల్యేల ప‌నులు కాకుండా చూడ‌డం.. ప‌ట్టించుకోక‌పోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనే నిర‌స‌న‌గ‌ళం వినిపించ‌డం..లాంటి చ‌ర్య‌లు మొద‌లుపెట్టార‌ట‌. ఈ ప‌రిస్థితుల్లో క్ర‌మంగా ఆయా ఎమ్మెల్యేలు దూర‌మ‌వ‌డం.. కేటీఆర్ చుట్టూ తిర‌గ‌డం మొద‌లైంది. ఇక ఏ ప‌ని కావాల‌న్న కేటీఆర్ క‌నుసైగ అవ‌స‌రం అన్న భావ‌న ఎమ్మెల్యేల్లో క‌ల్పించార‌ట‌.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మంత్రి హ‌రీశ్‌రావుతో ఎవ‌రు కూడా ట‌చ్‌లో లేర‌ట‌. ఇప్పుడు ఆయ‌న పార్టీలో ఒంట‌రిగా మిగిలిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఎంపీగా ఢిల్లీకి పంపించి, కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు లైన్ క్లియ‌ర్ చేస్తార‌నే టాక్ అప్ప‌ట్లో బాగా వినిపించింది. కానీ అవ‌న్నీ ఊహాగానాలేన‌ని పార్టీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌తో తేలిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ముచ్చ‌ట వినిపిస్తోంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్‌లో ఈసారి కేసీఆర్ గెల‌వ‌డం క‌ష్టేమేన‌ని, అందుకే ఆయ‌న సిద్దిపేట నుంచి పోటీ చేస్తార‌ని, గ‌జ్వేల్ నుంచి హ‌రీశ్‌ని బ‌రిలోకి దింపుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని, గ‌జ్వేల్‌లో అయితే.. హ‌రీశ్ గెలుస్తాడ‌నే మైండ్‌గేమ్‌కు కేసీఆర్ తెర‌లేపార‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

తాను గెల‌వ‌లేని ప‌రిస్థితులు ఉన్న చోట హ‌రీశ్ ఎలా గెలుస్తాడో కేసీఆర్‌కే తెలియాల‌ని, ఇదంతా హ‌రీశ్‌ని ప‌క్క‌న పెట్టేందుకు వేస్తున్న ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొన్న‌టివ‌ర‌కు కేసీఆర్ సొంత మీడియాలో మంత్రి హరీశ్‌రావు వార్త‌లు కూడా రాకుండా కేసీఆర్ ఆదేశించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇది తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో ఈ మ‌ధ్య మ‌ళ్లీ టీన్యూస్‌లో హరీశ్‌రావు మాట వినిపిస్తోంది.. న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్లో ఆయ‌న బొమ్మ క‌నిపిస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఏదేమైనా.. ఈ ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తాయో చూడాలి మ‌రి.

హ‌రీశ్‌ని త‌ప్పించేందుకు కేసీఆర్ భారీ స్కెచ్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share