వారి బలహీనత తో ఆడుకుంటున్న కేసీఆర్

September 7, 2018 at 12:04 pm

గులాబీ అధినేత కేసీఆర్ ప్రతిపక్షాల బలహీనతతో ఆడుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రతిపక్షాల లో ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా తెరాస తో ఒంటరిగా తలపడడానికి సిద్ధంగా లేదు, అంత బలంగా లేదు అనే సంగతిని కెసిఆర్ గుర్తించారు. ఏ పార్టీ అయినా కనీసం మరొక పార్టీతో జతకట్టి మాత్రమే కెసిఆర్ ను ఎదుర్కోవాలని భావిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఏ రెండు పార్టీల మధ్య కూడా ఏకాభిప్రాయం పొత్తుల నిర్ణయం అనేది జరగలేదు. సరిగ్గా ఆ వీక్ పాయింట్ మీదనే కెసిఆర్ దెబ్బ కొట్టారు.
ప్రతిపక్షాలు పొత్తుల చర్చలు సాగించడంలో విపరీతమైన జాప్యం జరిగే లాగా… ముందస్తు గానే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా కెసిఆర్ ప్రకటించేశారు. ఈ నిర్ణయం, ఈ దూకుడు ప్రతిపక్షాల మీద మరింత ఒత్తిడి పెంచడం మాత్రమే కాదు. వారి పొత్తుల మీద కూడా ప్రభావం చూపిస్తుందని అందరూ విశ్లేషిస్తున్నారు.

మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం , కేసీఆర్, ఒకే విడతలో 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో సహజంగానే ప్రతిపక్షాలకు కంగారు పుట్టింది. ఇప్పుడిక వారు ఎంత వేగంగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే అంతగా పరువు దక్కుతుంది . అభ్యర్థుల జాబితా విషయంలో ఎంత జాప్యం జరిగితే అంత గా పరువు పోతుంది. కెసిఆర్ చాలా వ్యూహాత్మకంగా ఇలాంటి ఇరకాటం పరిస్థితిలోకి వారిని నెట్టివేశారు.

అందుకే దాదాపుగా విపక్షాల్లో అన్ని ముఖ్యమైన పార్టీలు వారం రోజుల్లోగా తమ అభ్యర్థులను మొత్తం ప్రకటిస్తాం అంటూ ప్రస్తుతం ప్రగల్భాలు పలుకుతున్నాయి. అయితే వాస్తవంలో ఏ ఒక్క పార్టీ కూడా వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించేంత సిద్ధంగా , సన్నద్ధంగా లేదు అనేది నిజం. ఒంటరిగా పోటీ చేయాలా మరి ఎవరినైనా కలుపుకోవాలా అనేది కూడా ఏ పార్టీ ఇంకా తేల్చుకోలేదు. కలిసి పోటీ చేస్తాం అంటున్న అనేక చిన్న పార్టీలతో ఇంకా ఎవరెవరు కలుస్తారో తెలియలేదు.

Rahul-Gandhi-Uttam-644x362

మరి ఈ చిన్నా చితకా, ప్రధాన పార్టీల మధ్య పొత్తు నిర్ణయాలు అనేది వారం రోజుల్లోగా ఒక కొలిక్కివస్తాయా అంటే సందేహమే. అటు ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవలసిన కాంగ్రెస్ పార్టీది ఒక సమస్య అయితే… ఇటు అమరావతిలో కొలువుతీరిన చంద్రబాబు నాయుడు తమ మీద ఫోకస్ మళ్లించే వరకు ఎదురు చూడడం మరొక పార్టీ దుస్థితి. తెలంగాణ భారతీయ జనతాపార్టీ కూడా అధిష్టానానికి కేసీఆర్ కు మధ్య ఎలాంటి అవగాహన ఉందో ఏమో అనే మీమాంసలో ని ఇంకా కొట్టుమిట్టాడుతుంది. సిపిఐ సిపిఎం టీజేఎస్ లాంటి పార్టీలు పొత్తుకు సిద్ధం అని చాలాకాలంగా ప్రవచిస్తున్నాయి. అయితే వారు ఎవరితో కలుసుకుంటున్నారో… వారితో కలవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ఇంకా తేలలేదు.

ప్రతిపక్షాలు ఈ పొత్తుల విషయంలో ఒక కొలిక్కి, ఒక నిర్ణయానికి వచ్చే లోగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారంలో చాలా ముందుకు వెళ్లి పోతుంది అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ రకంగా కూడా ప్రతిపక్షాలను, మరింత ఒత్తిడి లోకి నెట్టి పైచేయి సాధించడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు.

10hymrl01-RevanGRU2R1PQN3jpgjpg

వారి బలహీనత తో ఆడుకుంటున్న కేసీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share