సిట్టింగులే కేసీఆర్ పుట్టి ముంచుతారా..?

September 8, 2018 at 11:01 am

కేసీఆర్‌.. రాజ‌కీయ మొండిఘ‌టం. ఎన్ని అండ్డంకులు, ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా బెదిరిపోని నేత‌. కేసీఆర్ ఇదే బ‌లం బ‌ల‌హీన‌త అనే టాక్ ఉంది. ఇప్పుడు కూడా పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ‌కీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. ముంద‌స్తుగానే తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసి రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు స‌`ష్టించారు. ఒక్క‌రోజులోనే తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి.. ముంద‌స్తు దూకుడు పెంచారు. ఏకంగా 105మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి, ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌తో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హ‌స్నాబాద్ నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించారు. తాను చెప్పిన‌ట్టుగానే ఇద్ద‌రుముగ్గురికి త‌ప్ప సిట్టింగులంద‌రికీ టికెట్లు ప్ర‌క‌టించారు. అయితే..ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్రక‌టించిన అభ్య‌ర్థుల జాబితాపైనే సొంత‌పార్టీవ‌ర్గాల‌తోపాటు ఇత‌ర ప‌క్షాలూ ఆశ్చ‌ర్య‌పోతున్నాయి.kcr(13)

తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసి కేసీఆర్ హైరిస్క్ తీసుకున్నార‌నే టాక్ ఓవైపు ఉండ‌గానే.. కేసీఆర్ మొండిత‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి గండిపెడుతుందా..? సిట్టింగులే కేసీఆర్ పుట్టిముంచుతారా..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. చాలామంది సిట్టింగులు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. పార్టీ క్యాడ‌ర్‌, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన అనేక స‌ర్వేల్లోనూ వారికి పెద్ద‌గా మార్కులు కూడా రాలేదు. ఈ క్ర‌మంలో ఇక ఈసారి వీళ్ల‌కు కేసీఆర్ ఎట్టిప‌రిస్థితుల్లో టికెట్లు ఇవ్వ‌ర‌ని గ‌ట్టిగా వాద‌న వినిపించింది. కానీ.. అనూహ్యంగా వారంద‌రికీ కేసీఆర్ టికెట్లు ప్ర‌క‌టించడంతో అంద‌రూ నోరెళ్ల బెట్టారు. ఇది వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌య‌మా? లేక ఇదే ఫైన‌లా ? అనేది మాత్రం ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా మానుకోట తాజా మాజీ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు కేసీఆర్‌ టికెట్ ప్ర‌క‌టించ‌గానే.. ఆ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ వ‌ర్గాలు సంబురాలు చేసుకున్నాయ‌ట‌. ఇది విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇక కాంగ్రెస్ నుంచి ఎవ‌రికి నిల‌బెట్టినా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నాయ‌ట‌. భూ వివాదాలు, క‌లెక్ట‌ర్‌తో అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌, క్యాడ‌ర్‌లో వ్య‌తిరేక‌త ఉన్న శంక‌ర్‌నాయ‌క్‌కు ఎలా టికెట్ ఇస్తార‌నే ప్ర‌శ్న‌లు గులాబీ వ‌ర్గాలే వేస్తున్నాయ‌ట‌. ఇక జ‌న‌గామ తాజామాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి ప‌రిస్థితి కూడా ఇంతే. ఆయ‌న చుట్టూ అనేక భూ వివాదాలు ఉన్నాయి. ఇటీవల రాత్రిపూట ఓ వీఆర్వో ఇంటికి వెళ్లడం పెద్ద క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న‌కు కూడా టికెట్ రాద‌నే టాక్ వినిపించింది. కానీ.. కేసీఆర్ ఆయ‌న‌కు టికెట్ కేటాయించారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వేముల‌వాడ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ పై కూడా క్యాడ‌ర్‌లో, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఆయ‌న‌కు కూడా టికెట్ వచ్చింది.kcr-angry-on-mla-shankar-nayak

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి జూప‌ల్లి క‌`ష్ణారావుపై కూడా భూ వివాదాలు ఉన్నాయి. అలాగే ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిపై కూడా అనేక వివాదాలు ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఇదే జిల్లాకు చెందిన న‌కిరేక‌ల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప‌రిస్థితి కూడా ఇదే. ఇలా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 20 నుంచి 30మంది సిట్టింగులు వివాదాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరంద‌రికీ కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. ఇలా వివాదాల్లో ఉన్న‌, ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డమే కేసీఆర్ కు అతిపెద్ద మైన‌స్ అని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే.. ప్ర‌తీ సీటు ఎంతో కీల‌కం. ఇందులో ఎంత‌మంది గెలుస్తారో తెలియాలంటే.. ఎన్నిక‌ల‌కు ఆగాల్సిందే మ‌రి.

సిట్టింగులే కేసీఆర్ పుట్టి ముంచుతారా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share