కేసీఆర్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న `కేసు`!

May 9, 2018 at 5:51 pm
KCR, Telangana, chandra babu, Vote for note case, revanth reddy

అవును! తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓటుకు నోటు కేసు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ కేసు విష‌యంలో ఎలా స్పందించి నా  కేసీఆర్‌కు పెద్ద చిక్కు వ‌చ్చిప‌డేలా క‌నిపిస్తోంది.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను ఒణికించిన ఓటుకు నోటు కేసు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ఈ కేసు ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో విచార‌ణ‌కు రానుంది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యే, మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వేసిన పిటిష‌న్ ఆధారంగా ఈ కేసును విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న కోర‌డం తో  మ‌ళ్లీ మొద‌టి కి వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడిన‌ట్టుగా ఉన్న వాయిస్‌ను ఫోరెన్సి క్ నివేదిక ఆధార‌గా సుప్రీం విచార‌ణ చేప‌ట్ట‌నుంది. 

 

అయితే, ఇక్క‌డే తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు ఆదేశించ‌డంతో కేసు మొత్తం మ‌ళ్లీ విచార‌ణ‌కు సిద్ధ‌మైంది. 2015లో తెలంగాణ శాస‌న మండ‌లికి జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని గెలిపించేందుకు నామినే టెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను కొంద‌రు క‌లిసి ఓటు త‌మ‌కు అనుకూలంగా వేయాల‌ని ఒత్తిడి చేయ‌డంతోపాటు డ‌బ్బును ఆఫ‌ర్ చేశారు. అయితే, దీనిని ఆయ‌న పూర్తిగా రికార్డు చేసిన ఏసీబీకి అంద‌జేశారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. 

 

ప్ర‌స్తుతం ఆయ‌న కండిష‌న్ బెయిల్‌పై బ‌య‌ట తిరుగుతున్నారు. అయితే, ఈ కేసులో వాయిస్ రికార్డు చంద్ర‌బాబుదేన‌ని ఆరోప‌ణ ఉంది. దీనిని ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు కూడా చేయించారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర వాద ప్ర‌తివాదాలు న‌డిచాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాబును ఇర‌కాటంలోకి నెట్టేలా వ్యాఖ్య‌లు సైతం సంధించారు. క‌ట్ చేస్తే.. బాబు హైద‌రాబాద్ నుంచి వ‌చ్చేయ‌డంతో ఈ కేసు తెర‌మ‌రుగైంది. అయితే, ఇంత‌లోనే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల మ‌ళ్లీ సుప్రీ త‌లుపు త‌ట్ట‌డంతో మొద‌టికి వ‌చ్చింది. ఈ విష‌యంలో ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం వేసే కౌంట‌ర్ పిటిష‌న్ పైనే విచార‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. దీంతో అంద‌రి దృష్టీ కేసీఆర్ పైనే ప‌డింది. 

 

ఇప్ప‌టికే దీనిని రాజ‌కీయం చేసేందు కు టీడీపీ మాజీ నేత ఈ కేసులో నెంబ‌ర్ -1 ముద్దాయి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. అదేవిథంగా తెలంగాణ టీడీపీ నాయ‌కులు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలావుంటే, చంద్ర‌బాబుపై ఎలాంటి నివేదిక ఇచ్చినా.. మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్‌పై ప్ర‌భావం ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, వరంగ‌ల‌, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ టీడ‌పీ హ‌వా కొనసాగుతోంది. ఈ నేప‌థ్యంలో బాబును ఇర‌కాటంలోకి నెట్టేలా కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

కేసీఆర్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న `కేసు`!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share