సారు…ముహూర్తం బాగోలేదు!

October 7, 2018 at 11:29 am

కేసీఆర్ మాట జ‌నం వింటే.. కేసీఆర్ మాత్రం జ్యోతిష్యం మాట జ‌వ‌దాట‌డు. ఆయ‌న వేసే ప్ర‌తీ అడుగు దానికి లోబ‌డే ఉంటుంద‌ట‌. తిథి, వార‌, న‌క్ష‌త్ర బ‌లాబ‌లాల ఆధారంగానే క‌ద‌లిక‌లు, నిర్ణ‌యాలు ఉంటాయట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముంద‌స్తు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు. ఈ తిథి వార నక్షత్రాల పరంగా అన్నీ సరిచూసుకుని శ్రావణ మాసం కృష్ణ ఏకాదశి గురువారం( సెప్టెంబ‌ర్ 6) నాడు సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ నిజానికి శాస‌న స‌భ ర‌ద్దు ప్ర‌క్రియ అంతా కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. ఇలా ఒక్క‌సారిగా అసెంబ్లీని ర‌ద్దు చేసి, తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చిన కేసీఆర్‌కు ఇది నిజంగా షాక్‌నిచ్చే వార్తే.

KTR_KCR_Facebook_3x2

తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. నిన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈమేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది. రాజ‌స్తాన్‌, మిజోరం, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌తోపాటు తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. తేదీల్లో కాస్తా తేడా వ‌చ్చింది. డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరోజున అమావాస్య. అయితే అమావాస్య తిథిని సాధారణంగా అందరూ కీడుగా భావిస్తుంటారు. నిజానికి తిథి, వార‌, న‌క్ష‌త్ర బ‌లాన్ని న‌మ్మే ఈ కేసీఆర్‌కు ఈ తేదీ అశుభ తేదీల‌నే టాక్ వినిపిస్తోంది. డిసెంబరు 7 ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి వచ్చింది. దీనిని కూడా అశుభ ఘ‌డియ‌గానే భావిస్తుంటారు.

మ‌రోవైపు డిసెంబ‌ర్ 11వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అయితే ఈ తేదీ కూడా కేసీఆర్‌కు క‌లిసొచ్చేతేదీ కాద‌నే టాక్ వినిపిస్తోంది. 11వ తేదీన చవితి వచ్చింది. ఇది కూడా శుభ సూచ‌కం కాదని భావిస్తుంటారు. మరి ఇలాంటి అశుభ ఘడియల్లో పోలింగ్ జ‌ర‌గ‌డం, ఫ‌లితాలు వెలువ‌డుతుండ‌డంతో కేసీఆర్ ఎలా భావిస్తార‌న్న‌దే ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తినిరేపుతోంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. ఒక‌వేళ తేదీలే క‌నుక శుభ‌సూచ‌కంగా ఉంటే.. టీఆర్ఎస్ నేత‌ల సంద‌డి మ‌రోలా ఉండేద‌ట‌. నిజానికి.. న‌వంబ‌ర్‌లోపే ఎన్నిక‌లు జ‌రిగితే కేసీఆర్‌కు క‌లిసివ‌స్తుంద‌ని పండితులు జోస్యం చెప్పిన‌ట్లు తెలిసింది. కానీ.. డిసెంబ‌ర్‌కు వెళ్ల‌డం.. అది కూడా తేదీలు అశుభ ఘ‌డియ‌లు కావ‌డంతో కేసీఆర్ ఏం చేస్తారో మ‌రి.

సారు…ముహూర్తం బాగోలేదు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share