
కేసీఆర్ మాటలు తూటాళ్లా పేలుతాయి. అవి ప్రతిపక్షాలను చీల్చిచెండాడుతాయి.. ఆయన నోరు తెరిస్తే ప్రత్యర్థులు పారిపోవాల్సిందే. అయితే.. కేసీఆర్ ఇప్పుడు మరో పనిమీద ద`ష్టిపెట్టారట. మాటతోనేకాదు.. మరోరకంగా కూడా ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే.. కేసీఆర్ ఆ ప్లాన్ వేస్తున్నది ఫాంహౌస్‌లో. ఆయన వ్యూహాలన్నీ ఫాంహౌస్‌లోనే ప్రాణం పోసుకుంటాయని సన్నిహితులు అంటుంటారు. పార్టీకి సంబంధించిన ప్రణాళికలు అన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయట. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో కేసీఆర్ సరికొత్త వ్యూహం.. అంటే ఆయనకు అది పాతబలమేగానీ.. దానిని సరికొత్తగా వాడాలని చూస్తున్నారట.
ఇంతకీ ఫాంహౌస్‌లో కేసీఆర్ చేస్తున్న ఆ పనేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇక అక్కడికే వద్దాం.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట.. కళాకారుల పాట ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచీ కాపాడుకుంటూ వచ్చింది పాటనేనని చెప్పాలి. ఉద్యమంలోకి ఎందరో నాయకులు వచ్చినా.. మరికొందరు తప్పుకున్నా.. పాట మాత్రం ఉద్యమానికి ఊపిరిపోసింది. తెలంగాణ సమాజాన్ని ఒక ఊపు ఊపింది. సకలజనులనూ ఏకం చేసింది. సభలు, సమావేశాల్లో గంటలకొద్దీ జనం నిలబడేలా చేసింది. ఇంతటి పాత్ర పోషించిన పాటను మరోసారి వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట.
నిజానికి.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా ఎప్పుడో జరిగిపోయిందట. తెలంగాణ ప్రముఖ కవులు, రచయితలతో పాటలు రాయించినట్లు తెలిసింది. అయితే.. అవన్ని కూడా ఇప్పుడు ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివ`ద్ధి, సంక్షేమ పథకాలపై రాసినవే కావడం గమనార్హం. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పాటల రూపంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది కేసీఆర్ వ్యూహం. అయితే..ఇప్పటికే రూపొందించిన పాటల సీడీలను పరిశీలించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారట. వీటిని ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి.. జనంలోకి వదిలేందుకు కసరత్తు చేస్తున్నారట.
నిజానికి.. 2014 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుమారు 500మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించారు కేసీఆర్. సాంస్క`తిక సారధి విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివ`ద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కళాకారులందరూ కూడా ఉద్యోగులుగా ఇప్పుడు పని చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు వీరు టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి వీలు లేదు. దీంతో కొత్తవారికి ఎన్నికల ప్రచారంలో అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సబంధించిన పాటలు కూడా వీరితోనే పాడిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నాచేస్తున్నారు. కేసీఆర్ పాటల ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.