కేసీఆర్ బీ ఫామ్‌లు ఇచ్చేదాకా డౌటేనా… కొత్త ఎత్తుగ‌డ ఇదే..!

September 14, 2018 at 5:28 pm

తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని ఒక్క‌రోజులోనే మార్చేశారు కేసీఆర్‌. గంట నుంచి రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేబినెట్ స‌మావేశం..అసెంబ్లీ ర‌ద్దుకు ఏక‌వ్యాఖ్య తీర్మానం.. గ‌వ‌ర్న‌ర్‌కు తీర్మాన‌ప‌త్రం అంద‌జేత‌..తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించ‌డం.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 105మంది పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు స‌`ష్టించారు. అయితే.. ఇప్పుడు అదేస్థాయిలో టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి సెగ‌లు ఎగిసిప‌డుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై ఆశావ‌హులు భ‌గ్గుమంటున్నారు. ఇక కొంద‌రైతే ఏకంగా కేసీఆర్ ఇంటిని సైహితం ముట్టడిస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కోండా సురేఖ దంప‌తులు హైద‌రాబాద్లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ కేసీఆర్ పోక‌డ‌ను ఎండ‌గ‌ట్టారు. ఈ ప‌రిస్థితి దాదాపుగా సగానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది.

download

అయితే.. 105మందిని పార్టీ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించిన కేసీఆర్.. ఓ విష‌యంలో మాత్రం కొంద‌రికి గ‌ట్టి వార్నింగే ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఏమిటా హెచ్చ‌రిక అంటే.. ఈ కొద్ది టైమ్‌లో మీమీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్యాడ‌ర్ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం.. అస‌మ్మ‌తి లేకుండా చూసుకోవ‌డం..మీమీ అభ్య‌ర్థిత్వాల‌పై ఎలాంటి నిర‌స‌న‌లు లేకుండా చూసుకోవాల‌ని.. లేని ప‌క్షంలో బీఫాం మాత్రం ద‌క్క‌ద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడే ఈ వ్యాఖ్య‌లే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో భ‌గ్గుమ‌న‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌నే టాక్ వినిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మ‌ల్యేల‌కు పోటీగా మ‌రికొంద‌రు ఈసారి త‌మ‌కే టికెట్ అని.. ఈ మేర‌కు కేసీఆర్ హామీ ఇచ్చార‌ని ప్ర‌చారం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Early-polls-a-KCR-political-masterstroke

నిజానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కాద‌ని ముందుకు వెళ్లే సాహ‌సం చేసే ధైర్యం ఆశావ‌హుల‌కు లేదు. కానీ.. ఇప్పుడు ఆశావ‌హులు ధైర్యంగా త‌మ కోరిక‌ను చెబుతున్నారు. ప‌లువురు సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి.. ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. ఈ అస‌మ్మ‌తి ఎక్కువ‌గా ఏయే సిట్టింగ్ ఎమ్మెల్యేల‌నైతే కేసీఆర్ హెచ్చ‌రించారో.. ఆయా స్థానాల్లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌నీ.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ఇదంతా న‌డుస్తుంద‌నే టాక్ పార్టీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. టికెట్లు ఇచ్చిన త‌ర్వాత ఇక ఇందులో ఎలాంటి మార్పులు లేవ‌ని చెప్ప‌కుండా.. ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని, లేనిప‌క్షంలో బీఫాంలు ఇవ్వ‌న‌ని.. ఆయ‌న ప‌రోక్షంగా ఆయా స్థానాల్లో ఆశావ‌హుల‌ను ఎగేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక..చివ‌ర‌కు.. నేను చెప్పిన‌ట్లుగా సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇచ్చాన‌నీ.. కానీ మీమీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌మ్మ‌తి సెగ‌ల‌ను చ‌ల్లార్చ‌డంలో విఫ‌లం అయ్యారు కాబ‌ట్టే.. పార్టీ క్యాడ‌ర్ కోరిక‌మేర‌కు ఇత‌రుల‌కు బీఫాంలు ఇస్తున్నాన‌ని చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్ప‌డమే కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. నిజానికి.. ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కు టికెట్ ఇవ్వ‌డాన్ని రాజార‌పు ప్ర‌తాప్‌వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇస్తాన‌ని కేసీఆర్ చెప్పారంటూ ఇన్నిరోజులు రాజార‌పు ప్ర‌తాప్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. తీరా టికెట్ రాజ‌య్య‌కే రావడంతో ప్ర‌తాప్ షాక్ తిన్నారు. ఇప్పుడు తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ సీఎం వ‌ద్ద‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ‌య్య‌కు బీఫాం వ‌స్తుందో రాదోన‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇదే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. కేసీఆరా.. మ‌జాకా..!

కేసీఆర్ బీ ఫామ్‌లు ఇచ్చేదాకా డౌటేనా… కొత్త ఎత్తుగ‌డ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share