కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ బెడిసికొట్టిందా…!

March 17, 2018 at 10:33 am
KCR, Telangana, TRS, Third Front, congress party

తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం చేసిన థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌క‌ట‌న తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా జాతీయ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌లు రేపింది. త‌న‌కు ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు మ‌రికొంద‌రు ఫోన్ చేసి ఈ థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగ‌తించిన‌ట్టు చెప్ప‌డంతో జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీ, కాంగ్రెస్సేత‌ర రాజ‌కీయ ప‌క్షాలు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఒక్క‌టవుతాయా ? అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. 

 

కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌ను ఎంతో మోసం చేశాయ‌ని, కాలం క‌లిసోస్తే తాను థ‌ర్డ్ ఫ్రంట్‌కు నేతృత్వం వ‌హించి జాతీయ రాజ‌కీయాల్లో మార్పులు తీసుకువ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎలెర్ట్ అయ్యారు. ఆమె నేరుగా రంగంలోకి దిగి కొన్ని పార్టీలోత చ‌ర్చ‌లు స్టార్ట్ చేసేశారు.

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని చాలా ప్రాంతీయ పార్టీలు కాచుకుని కూర్చొన్నాయి. చివ‌ర‌కు మోడీ తీరుతో శివ‌సేన‌, టీడీపీ లాంటి మిత్ర‌ప‌క్షాలే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కేసీఆర్ లాంటి వాళ్లు ఎప్పుడూ మోడీకి యాంటీగా ఉండేందుకు రెడీగానే ఉంటారు. ఇక యూపీఏకు నేతృత్వం వ‌హిస్తోన్న కాంగ్రెస్ రోజు రోజుకు బ‌ల‌హీన‌మ‌వుతోంది. చివ‌ర‌కు ఈ పార్టీ ప్రాంతీయ పార్టీల మీద ఆధార ప‌డాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చేసింది.

 

దేశ‌వ్యాప్తంగా ముఖ్యంగా నార్త్‌లో బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతున్నా ఆ మేర‌కు ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయే త‌ప్పా కాంగ్రెస్ మాత్రం బ‌ల‌ప‌డ‌డం లేదు. కాంగ్రెస్ చివ‌ర‌కు యూపీ ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్ వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. 

 

మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ – ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇప్పటికే చ‌ర్చ‌లు స్టార్ట్ చేశారు. ఇక రాహుల్ గాంధీ ఇప్ప‌టికే శ‌ర‌ద్ ప‌వార్ ఇంటికి కూడా వెళ్లారు. శ‌ర‌ద్ ప‌వార్ లాంటి కీల‌క‌నేత‌ను వ‌దులుకునేందుకు ఇష్టం లేకే ఆయ‌న్ను ముందుగా త‌మ లైన్లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు కాంగ్రెస్ స్టార్ట్ చేసేసింది. ఇక ఈ నెల 28న శరద్ పవార్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

 

మ‌మ‌త ఎప్పుడూ బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటుంది. బీజేపీని దేశం నుంచి త‌రిమి వేయాల‌న్న‌దే మ‌మ‌త తాజా నినాదం. ఇక కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌కు ముందుగా మ‌ద్ద‌తు ఇచ్చిన నేత‌ల్లో కీల‌కం అయిన మమతాబెనర్జీ – శరద్ పవార్ కు ఆదిలోనే బ్రేకులు వేసే విష‌యంలో కాంగ్రెస్ స‌క్సెస్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక మ‌రోవైపు చంద్ర‌బాబు నేతృత్వంలో 11 పార్టీల‌తో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్ప‌డుతుంద‌న్న ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఈ ఫ్రంట్‌లోనూ మ‌మ‌తా బెన‌ర్జీ పేరు వినిపిస్తోంది. ఏదేమైనా ఎవ‌రు ఎవ‌రితో వెళ‌తారో ? ఏ ఫ్రంట్‌లో ఉంటారో ? అన్న‌దానిపై ప్ర‌స్తుతానికి అయితే క్లారిటీ లేదు.

 

కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ బెడిసికొట్టిందా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share