కేసీఆర్ కూడా మరో బీకాంలో ఫిజిక్సా!

October 19, 2018 at 7:42 pm

కొన్నాళ్ల కింద‌ట వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ త‌డబా టు వ్యాఖ్య‌లు చేసి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయిన విష‌యం తెలిసిందే. మంత్రి ప‌ద‌వి ఆశ‌ల‌తో వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గురించి తెలుసుకోవాల‌ని, ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూ చేయాల‌ని భావిం చిన టీవీ చానెల్ ప్ర‌తినిధి జ‌లీల్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంలోనే ఆయ‌న త‌న చ‌దువు గురించి వివ‌రిస్తూ.. బీకాంలో ఫిజిక్స్ చ‌దివాన‌ని వాదించారు. దీంతో దిమ్మ‌తిరిగి పోయిన టీవీ చానెల్ ప్ర‌తినిధి ప‌దే ప‌దే బీకాంలో ఫిజిక్స్ ఉండ‌ద‌ని వాదించారు. అయినా కూడా ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మాత్రం.. బీకాంలో ఫిజిక్స్ ఉంటుంద‌ని వాదించారు.

andhra-mla-edu_youtube_759

దీంతో ఆయ‌న ప‌రువు కృష్ణాన‌దిలో కొట్టుకుపోయింది. అంతేకాదు. మంత్రి ప‌ద‌విని ఇవ్వాల‌ని భావించిన చంద్ర‌బాబు బీకాంలో ఫిజిక్స్ అన్న నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి ఇస్తే.. త‌న‌కు ఎస‌రు ఖాయ‌మ‌ని బావించి ప‌క్క‌కు త‌ప్పించారు. ఇది అప్ప‌ట్లో ఏపీ, తెలంగాణాల్లో తీవ్ర చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌ట్ చేస్తే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామమే తెలంగాణాలోనూ చోటు చేసుకుంది. ఏకంగా తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్‌.. కూడా ఇలానే వ్యాఖ్యానించి మీడియాకు దొరికిపోయారు. బీకాం లో ఫిజిక్స్ త‌ర‌హాలోనే ఎంఎస్సీ పొలిటిక‌ల్ సైన్స్ అనేస్తూ మీడియాకి చిక్కాడు. ప్ర‌స్తుతం ఆ క్లిప్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ అన‌బోయి పొర‌పాటున‌ ఎంఎస్సీ పొలిటిక‌ల్ సైన్స్ అనేశారు.

నిజానికి ఇప్పుడున్న ట్రెండ్‌లో మీడియాకు ఇలాంటి వ్యాఖ్య‌లే కావాలి. అంతే! ఇంకేముంది.. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు సెక‌న్ల వ్య‌వ‌ధిలో ప్ర‌చారం వ‌చ్చేసింది. ఇక‌, కేసీఆర్ ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు రేవు పెడ‌దామా? అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు సైతం ఈ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎన్నిక‌ల వేళ కేసీఆర్ అండ్ కోని ఎలా అన్ పాపుల‌ర్ చేయాలా? అన్న దుగ్ధ‌తో ర‌గిలిపోతున్నారు. దీంతో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా సోష‌ల్ మీడియాల్లో త‌డాఖా చూపించేస్తున్నారు. ప్ర‌స్తుతం సునామీ వేగంతో దూసుకుపోతున్న కేసీఆర్ వ్యాఖ్య‌లతో ఈర‌కంగా తెలంగాణాలో విప‌క్షాలు పండ‌గ చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇదీ కేసీఆర్ త‌డ‌బాటు!!

కేసీఆర్ కూడా మరో బీకాంలో ఫిజిక్సా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share