మరో తిరుగుబాటు : కేసీఆర్ కే సవాల్!

September 9, 2018 at 10:36 am
444333

తెలంగాణ రాష్ట్ర సమితికి ఇది మరో ఝలక్. టికెట్ దక్కలేదనే కోపంతో మరో సీనియర్, ప్రజాబలం ఉన్న నాయకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కేసీఆర్ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన సమయంలో… అసంతృప్తుల గురించి మీడియా అడిగినప్పుడు.. వారి సంగతి మేము చూసుకుంటాం కదా.. మీకెందుకు? అంటూ ధీమాగా జవాబిచ్చారు. కేసీఆర్ దూకుడు చూసిన వారంతా తిరుగుబాటు చేసే సాహసం ఎవరికీ ఉండదేమో అని కూడా అనుకున్నారు. కానీ రెండు రోజుల్లో రెండు తిరుగుబాటు జెండాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే వరంగల్ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ సిటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ కేసీఆర్ ను తూర్పారపట్టారు. తాజాగా మాజీ ఎంపీ, ఆదిలాబాద్ జిల్లాలో జనబలం ఉన్న ఎస్టీ నాయకుడు రమేశ్ రాథోడ్ ఇప్పుడు తిరగబడ్డారు. ఆయన ఖానాపూర్ టికెట్ ఆశించగా.. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్ కే అవకాశం దక్కింది. దాంతో ఆగ్రహించిన రాథోడ్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటేనే తెరాస లో చేరానని, ఇప్పుడిక పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. తనమీద కేసీఆర్ స్వయంగా వచ్చి పోటీ చేసిన గెలవలేరని సవాల్ విసిరారు. కాకపోతే ఇంకా ఏ పార్టీలో చేరేది ఆయన నిర్ణయించుకోలేదు.konda-surekha-kcr

మేష్ రాథోడ్ సీనియర్ నాయకుడు. గతంలో తెలుగుదేశంలో ఉండేవారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన ఆయన ఎంపీ గా కూడా గెలిచారు. ఖానాపూర్ నుంచే గతంలో ఎమ్మెల్యేగాను గెలిచారు. తర్వాత ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా అదే సీట్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెరాస లో చేరినా, ఇంత ప్రజాబలం ఉన్న తనకు టికెట్ నిరాకరించేసరికి ఆయనకు కోపం వచ్చినట్లుంది.4355_Ramesh_Rathod

అయితే ఇక్కడ మరో విశ్లేషణ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎందరు టికెట్లు అశిస్తున్నారో కేసీఆర్ కు ముందే తెలుసు. ఇంత దూకుడుగా టికెట్స్ ప్రకటించిన ఆయన… ముందే అసంతృప్తులను ఎందుకు బుజ్జగించలేకపోయారనే చర్చ వినిపిస్తోంది. మరిన్ని తిరుగుబాట్లు రచ్చ కెక్కకముందే తెరాస నాయకులు మేలుకుంటారో లేదో చూడాలి.kondasurekha1496472266

మరో తిరుగుబాటు : కేసీఆర్ కే సవాల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share