సారి… మీకు టికెట్లు లేవు : కేసీఆర్

September 6, 2018 at 4:22 pm
KCR, TRS, Press meet, Tickets Announcement, Elections

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా తూర్పునియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ‌కు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈరోజు ప్ర‌క‌టించి పార్టీ అభ్య‌ర్థుల జాబితాలో ఆమె పేరు లేదు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం అబ్య‌ర్థి పేరును పెండింగ్‌లో పెట్టిన‌ట్లు స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో వ‌రంగ‌ల్ జిల్లాల్ ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జిల్లాలోఉన్న మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క తూర్పు స్థానాన్నే పెండింగ్ లో ఉంచారు కేసీఆర్‌. ఇప్పుడు ఈ విష‌యం జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని మొత్తం 119 స్థానాల‌కు గాను తొలిజాబితాలో 105మంది పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో ఆందోల్‌, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబుమోహ‌న్‌, న‌ల్లాల ఓదేలుకు టికెట్లు నిరాక‌రించారు. ఇక వ‌రంగ‌ల్ తూర్పును మాత్రం పెండింగ్లో పెట్ట‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ విష‌యంలో ముందుముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే.. కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలేమిట‌నే దానిపై పార్టీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఆమె భ‌ర్త కొండా ముర‌ళి ఎమ్మెల్సీ కొన‌సాగుతున్నారు. అయితే కొంత కాలంగా కొండా దంప‌తులు తిరిగి కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. అంతేగాకుండా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తోపాటు త‌న కూతురు కూడా టికెట్ వ‌స్తుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూతురుకేన‌ని, స్పీక‌ర్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆమె బ‌హిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి.

కొద్దిరోజులుగా వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌కు, కొండా సురేఖ‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో గ్రూపులు ఏర్ప‌డ్డాయి. దీంతో కొండా సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఇక్క‌డి నాయ‌కులు స్వ‌యంగా కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది. అంతేగాకుండా.. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ కొండా దంప‌తులు చురుగ్గా లేక‌పోవ‌డం.. ఇదే స‌మ‌యంలో అనేక వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మార‌డంతో కేసీఆర్ కూడా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు ఆయ‌న సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. తొలిజాబితాలో ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగ్ పెట్ట‌డంతో ఆమె అనుచ‌ర‌వ‌ర్గంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇది జిల్లా రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి మ‌రి.

టీఆరెస్ అభ్యర్థుల జాబితా(జిల్లాలవారీగా)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
1. భద్రాచలం – తెల్లం వెంకటరావు
2. పినపాక – పాయం వెంకటేశ్వర్లు
3. అశ్వారావుపేట – తాటి వెంకటేశ్వర్లు
4. ఇల్లందు – కోరం కనకయ్య
5. కొత్తగూడెం – జలగం వెంకటరావు

ఖమ్మం జిల్లా
6. ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
7. పాలేరు – తుమ్మల నాగేశ్వరరావు
8. వైరా – బానోత్ మదన్ లాల్
9. మధిర – లింగాల కమల్‌రాజ్
10. సత్తుపల్లి – పిడమర్తి రవి

మహబూబాబాద్
11. మహబూబాబాద్ – బానోత్ శంకర్ నాయక్
12. డోర్నకల్ – డీఎస్ రెడ్యానాయక్
వరంగల్ (రూరల్)
13. పరకాల – చల్లా ధర్మారెడ్డి
14. నర్సంపేట్ – పెద్ది సుదర్శనరెడ్డి
15. వర్ధన్నపేట్ – ఆరూరి రమేశ్
వరంగల్ అర్బన్
16. వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ్ భాస్కర్
జయశంకర్ భూపాలపల్లి
17. భూపాలపల్లి – ఎస్.మధుసూదనాచారి
18. ములుగు – అజ్మీరా చందూలాల్
జనగామ
19. జనగామ – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20. స్టేషన్ ఘన్‌పూర్ – డాక్టర్ తాటికొండ రాజయ్య
21. పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకరరావు

నల్గొండ
22. నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
23. మిర్యాలగూడ – ఎన్.భాస్కర్
24. నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
25. దేవరకొండ-రమావత్ రవింద్రకుమార్
26. మునుగోడు-కాసుకుంటల ప్రభాకర్‌రెడ్డి
27. నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట
28. సూర్యాపేట- జగదీశ్‌రెడ్డి
29. తుంగతుర్తి- గ్యాదరి కిశోర్‌కుమార్
యాదగిరి భువనగిరి
30. ఆలేరు-గొంగెడి సునీత
31. భువనగిరి-శంకర్‌రెడ్డి

నిజామాబాద్
32. నిజామాబాద్ అర్బన్-బి.గణేష్
33. నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
34. ఆర్మూర్-జీవన్‌రెడ్డి
35. బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
36. బోధన్-షకీల్ అహ్మద్
కామారెడ్డి
37. బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
38. కామారెడ్డి-గంపా గోవర్ధన్
39. జుక్కల్-హన్మంతు షిండే
40. ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్
41. ఆదిలాబాద్-జోగు రామన్న
42. బోథ్-రాథోడ్ బాబూరావు
43. ఖానాపుర్-రేఖానాయక్
ఆసిఫాబాద్
44. ఆసిఫాబాద్-కోవా లక్ష్మి
45. సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కోనప్ప
నిర్మల్
46. నిర్మల్ – అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
47. ముథోల్ – జి.విఠల్ రెడ్డి
మంచిర్యాల
48. మంచిర్యాల – నడిపల్లి దివాకర రావు
49. బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య
50. చెన్నూర్ – బాల్క సుమన్
కరీంనగర్
51.కరీంనగర్- గంగుల కమలాకర్
52.హుజూరాబాద్-ఈటెల రాజేందర్
53.మానకొండూర్-రసమయి బాలకిషన్
సిరిసిల్ల
54సిరిసిల్ల-కేటీ రామారావు
55.ఎస్ఎస్ వేములవాడ-చెన్నమనేని రమేష్
జగిత్యాల
56.జగిత్యాల-డాక్టర్ ఎం సంజయ్ కుమార్
57.కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
58.ధర్మపురి-కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి
59.పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
60.మంథని-పుట్టా మధుకర్
61.రామగుండం-సోమారపు సత్యనారాయణ

సిద్దిపేట
62.సిద్దిపేట్-తన్నీరు హరీష్ రావు
63.దుబ్బాక-సొల్లిపేట రామలింగారెడ్డి
64.గజ్వేల్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
65.హుస్నాబాద్-వొడితెల సతీష్ కుమార్
మెదక్
66.మెదక్-శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి
68.నరసాపూర్-చిలుముల మదన్ రెడ్డి
సంగారెడ్డి
69.సంగారెడ్డి-చింతా ప్రభాకర్
70.నారాయణ్‌ఖేడ్-ఎం.భూపాల్ రెడ్డి
71.పటాన్‌చెరువు-గూడెం మహిపాల్ రెడ్డి

మహబూబ్‌నగర్
72. మహబూబ్‌నగర్ – వి.శ్రీనివాసగౌడ్
73. జడ్చెర్ల – డాక్టర్ చెర్నాకోల్ లక్ష్మారెడ్డి
74. దేవరకద్ర – ఆలె వెంకటేశ్వరరెడ్డి
75. నారాయణ్ పేట్ – ఎస్.రాజేందర్ రెడ్డి
76. మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నాగర్ కర్నూల్
77. నాగర్ కర్నూల్ – మర్రి జనార్దనరెడ్డి
78. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
79. అచ్చంపేట్ – గువ్వల బాలరాజు
80. కల్వకుర్తి – జి. జైపాల్ యాదవ్
వనపర్తి
81. సింగిరెడ్డి – నిరంజన్ రెడ్డి
గద్వాల్
82. గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
83. ఆలంపూర్ – వల్లూర్ మల్లెపోగు అబ్రహం
వికారాబాద్
84. పరిగి – కొప్పుల మహేశ్వరరెడ్డి
85. తాండూర్ – పట్నం మహేందర్ రెడ్డి
86. కొడంగల్ – పట్నం నరేందర్ రెడ్డి

రంగారెడ్డి
87.షాద్ నగర్ – వై.అంజయ్యయాదవ్
88.రాజేంద్ర నగర్-టి.ప్రకాష్ గౌడ్
89.మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి
90.ఇబ్రహీంపట్నం-మంచిరెడ్డి కిషన్ రెడ్డి
91.శేర్లింగంపల్లి-అరెకపూడి గాంధీ
92.ఎల్బీ నగర్-ముద్దగోని రాం మోహన్ గౌడ్
93.చేవెళ్ల-కాలె యాదయ్య
మల్కాజ్‌గిరి-మేడ్చల్
94.కుత్బుల్లాపూర్-కేపీ వివేకానంద
95.కూకట్ పల్లి-మాదవరం క్రిష్ణారావు
96.ఉప్పల్-బేతి సుభాష్ రెడ్డి

హైదరాబాద్
97.సికింద్రాబాద్-టి.పద్మారావు గౌడ్
98.సనత్ నగర్-తలసాని శ్రీనివాస యాదవ్
99.కంటోన్మెంట్-జి.సాయన్న
100.జూబ్లీ హిల్స్-మాగంటి గోపీనాథ్
101.యాకత్‌పురా-సామ సుందర్ రెడ్డి
102.చాంద్రాయణ గుట్ట-ఎం.సీతారామ్ రెడ్డి
103.కార్వాన్-టి.జీవన్ సింగ్
104.బహదూర్ పుర-ఇనాయత్ అలీబక్రీ
105.నాంపల్లి-మునుకుంట్ల ఆనంద్ గౌడ్

సారి… మీకు టికెట్లు లేవు : కేసీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share