కేసీఆర్ వార్నింగ్‌: కొడుకుల‌నే దూరం పెట్టిన టీఆర్ఎస్ టాప్ లీడ‌ర్‌

February 20, 2018 at 4:37 pm
KCR, TRS, Telangana, Leader, sirikonda madhusoodhana chari

తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. కొడుకుల పనితీరుతో టీఆర్ఎస్ క్యాడర్లో, ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన సిరికొండ పరువును కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఆయన కుమారులు ప్రశాంత్, ప్రదీప్, క్రాంతి నియోజకవర్గ పరిధిలో అంతా తామేనన్నట్లు వ్యవహరించారు. రోజరోజుకూ వాళ్ల పనితీరుతో నియోజకవర్గంలో స్పీకర్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజల నుంచి క్యాడర్ నుంచి అధికార యంత్రాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

 

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారికి టికెట్ రాదనీ, ఆయనపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఓ దశలో స్పీకర్ కు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న విషయం కూడా బయటకు వచ్చింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ ఓడిపోవడానికి స్పీకర్ కొడుకులేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇక స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు కీలక నేతలు అన్నారు. 

 

మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన గండ్ర సత్యనారాయణరావు టీడీపీ వీడి టీఆర్ఎస్ లో చేరడంతో ఇక సరికొండ పని అయిపోయినట్టేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మంచిది కాదని గుర్తించిన స్పీకర్ సిరికొండ తన కుమారులను క్రమంగా దూరం పెట్టారు. ఎముకలు కొరికే చలిలోనూ నియోజకవర్గ పరిధిలో పల్లెప్రగతి నిద్ర పేరుతో విస్తృతంగా పర్యటించి ప్రజలకు దగ్గర య్యేందుకు యత్నిస్తున్నారు. 

 

ప్రస్తుతం కుమారులను పూర్తిగా దూరంగా పెట్టిన స్పీకర్ క్రమంగా సీఎం కేసీఆర్. వద్ద ఇటీవల మంచి మార్కులు కొట్టేసినట్టు సమాచారం. నియోజకవర్గ పరిధిలో కూడా ఆయనపై క్యాడర్లో,  ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కొడుకులను దూరంగా పెట్టి సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారని సిరికొండపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. కుమారుల ఎఫెక్ట్ గ‌ట్టిగా ఉండ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో స్పీక‌ర్‌పై యాంటీ ఉన్న‌ట్టు కేసీఆర్‌కు ఇంటిలిజెన్స్ రిపోర్టులు ఎక్కువుగా వెళ్ల‌డం, కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌ను, ఎమ్మెల్సీగా పంపుతాన‌ని చెప్ప‌డంతో… స్పీక‌ర్ కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేసుకుని ఇప్పుడు కుమారుల‌ను దూరం పెట్టి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

 

కేసీఆర్ వార్నింగ్‌: కొడుకుల‌నే దూరం పెట్టిన టీఆర్ఎస్ టాప్ లీడ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share